Mahaa Daily Exclusive

  పెద్దమ్మగడ్డ ప్రజలకు వైద్య వరం

Share

  • రూ.1.43 కోట్లతో అర్బన్ హెల్త్ సెంటర్
  • శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాయిని, జిల్లా కలెక్టర్

హనుమకొండ, మహా ;

వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నేతృత్వంలో అభివృద్ధి పథంలో దూసుకు పోతున్నది.

పశ్చిమ నియోజకవర్గం లోని పెద్దమ్మగడ్డ కాలనీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మరో కీలక అడుగు ముందుకు పడింది. రూ.1.43 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పెద్దమ్మగడ్డ ప్రాంతం ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి దూరంగా ఉందన్నారు. గతంలో ఈ ప్రాంతాన్ని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకున్నారే తప్ప, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందు కు తగిన చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.

ప్రజలు వైద్యం కోసం దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా పెద్దమ్మగడ్డలోనే మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు నాయిని తెలిపారు. రూ.1.43 కోట్లతో నిర్మించే ఈ కేంద్రంలో వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో కూడా ఇప్పటికే చర్చించినట్లు వెల్లడించారు.

రోడ్లు, డ్రైనేజీకి అత్యంత ప్రాధాన్యం

ముఖ్యంగా పెద్దమ్మగడ్డ అభివృద్ధికి

రోడ్లు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి కూడా ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే నాయిని తెలిపారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు అంబేద్కర్ భవన్ ఏర్పాటు ప్రతిపాదనను కూడా పరిశీలిస్తామని, అవసరమైన నిధులు కేటాయించి నిర్మాణం చేపట్టేందు కు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పెద్దమ్మగడ్డను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, వైద్య సదు పాయాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని నాయిని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ డిఎంహెచ్వో అప్పయ్య, మాజీ బ్లాక్ అద్యక్షులు హన్మకొండ అంబేద్కర్ రాజు, మాజీ కార్పొరేటర్ డిన్నా, జిల్లా అధికారులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Latest