*గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన బల్దియా కమీషనర్ టీ. వెంకన్న*
హనుమకొండ,మహా ;
ఈ రోజు జరుగనున్న గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు జీడబ్ల్యూఎంసీ చేపట్టిన ఏర్పాట్లను కమిషనర్ టి. వెంకన్న, వరంగల్ సెంట్రల్ డీసీపీ ధారా కవిత తో కలిసి ఉదయం 6 గంటల నుంచే క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు.
సంబంధిత అధికారులతో కలిసి పరికికుంట, కడిపికొండ ఔటర్ రింగ్ రోడ్ సమీపం, హసన్‌పర్తి చెరువు, భీమారం చెరువు, గోపాల్‌పూర్ అరెకసాయికుంట,
గుండ్ల సింగారం ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని ప్రాంతం
తదితర ప్రధాన నిమజ్జన కేంద్రాలను సందర్శించి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.
నిమజ్జన కేంద్రాల్లో బ్యారికేడింగ్, లైటింగ్, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సదుపాయాలు, క్రేన్లు, ట్రాఫిక్ నియంత్రణ తదితర ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ, నిమజ్జనం పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సూచించారు.
ఈ పరిశీలనలో బల్దియా సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్‌కుమార్, పీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేష్, ఏసీపీ ప్రశాంత్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రవికుమార్, మాధవి, మహేందర్, సంజయ్‌కుమార్, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.








