Mahaa Daily Exclusive

  పరిశోధనలను దేశీయ ప్రయోజనాలుగా… మార్చడంలో విద్యాసంస్థల పాత్ర కీలకం..! బిట్స్ పిలానీ వీసీ, ప్రొఫెసర్ వి.రామ్ గోపాల్ రావు..

Share

  • పరిశోధనలను క్షేత్రస్థాయిసాంకేతికతగా మార్చడమే లక్ష్యం
  • బిట్స్ పిలానీ వీసీ, ప్రొఫెసర్ వి.రామ్ గోపాల్ రావు
  • బిట్స్ పిలాని…డిఐఏటి ఆధ్వర్యంలో ఘనంగా డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ డే

జవహర్ నగర్, మహా : పరిశోధనలను దేశీయ ప్రయోజనాలుగా మార్చడంలో విద్యాసంస్థల పాత్ర కీలకమని, పరిశోధనలను క్షేత్రస్థాయి సాంకేతికతగా మార్చడమే లక్ష్యమని బిట్స్ పిలాని హైదరాబాద్ వైస్ ఛాన్సర్ ప్రొఫెసర్ వి. రామ్ గోపాల్ రావు పేర్కొన్నారు. జాతీయ భద్రత రక్షణ రంగానికి అవసరమైన స్వదేశీ పరిజ్ఞానాన్ని మరింత వేగవంతం చేసేందుకు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ (డిఐఏటి) పూణే సంయుక్తంగా బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్ లో డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ డే_ 2026 లు మంగళవారం ఘనంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో భాగంగా మిషన్ రెడీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఇన్నోవేషన్ అకాడమీ పరిశ్రమల భాగస్వామ్యం అనే నినాదంతో ఈ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 45 ప్రముఖ కంపెనీలు రక్షణ సంస్థలకు చెందిన సుమారు 125 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్( డిఆర్డిఓ) డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ( డిఏఈ) మిధాని, బిఈఎల్, హెచ్ఎఎల్, వంటి ప్రముఖ జాతీయ సంస్థల ఉన్నతాధికారులు ఇందులో పాల్గొని కీలక చర్చల్లో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా 20 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

సదస్సులో భాగంగా బిట్స్ పిలాని, డిఐఏటి, పూణే రక్షణ రంగ భాగస్వామి సంస్థల మధ్య 20 కీలక అవగాహన ఒప్పందాలు కుదిరాయి. పరిశోధన సాంకేతిక పరిజ్ఞాన బదిలీ సంయుక్త వాణి జీకర దీనికి తోడు అడ్వాన్సుడ్ మెటీరియల్స్ ఎలక్ట్రానిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, స్వయం ప్రతిపత్తి వ్యవస్థలు సెన్సార్ లు వంటి కీలక విభాగాల్లో రూపొందించిన 48 స్వదేశీ సాంకేతిక ఆవిష్కరణలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో హాజరైన డాక్టర్ బి. హెచ్. వి. ఎస్. నారాయణమూర్తి వైస్ ఛాన్ లర్ మాట్లాడుతూ ప్రస్తుత అసిమెట్రిక్ యుద్ధ తంత్రాల కాలంలో డిఆర్డిఓ పరిశ్రమలు విద్యాసంస్థలు కలిసి పనిచేయడం అత్యంత అవశ్యకమన్నారు. గ్లోబల్ సవాళ్లను ఎదుర్కునేందుకు వేగవంతమైన మిషన్ సామర్థ్యాలను పెంచుకోవాలని సూచించారు. అనంతరం డాక్టర్ జగన్నాథ్ నాయక్ డీజి మిషన్ ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ కంప్యూటర్ నేషనల్ సిస్టం డిఆర్డిఓ మిస్సైల్ సిస్టం వంటి వ్యూహాత్మక రంగాలలో పరిశోధన అభివృద్ధి ప్రారంభ దశ నుంచే పరిశ్రమల భాగస్వామ్యం కావాలని సూచించారు. అనంతరం రాజేందర్ సింగ్ భాటియా చైర్మన్ కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టం లిమిటెడ్ మాట్లాడుతూ… సాంకేతిక రంగంలో వినూత్న ఆవిష్కరణలు సాధించాలంటే రిస్కు తీసుకోవడం వైఫల్యాలను అంగీకరించి నేర్చుకోవడం అలవాటు చేసుకోవాలన్నారు. అనంతరం ప్రొఫెసర్ వి. రామ్ గోపాల్ రావు వైస్ ఛాన్స్ లర్ బిట్స్ పిలాని మాట్లాడుతూ పరిశోధనలను దేశీయ ప్రయోజనాలు గా మార్చడంలో విద్యాసంస్థలు పరిశ్రమల భాగస్వామ్యం ఒక ముఖ్యమైన మైలురాయి అని తెలిపారు. ప్రయోగశాలలో జరిగే పరిశోధనలను క్షేత్రస్థాయి సాంకేతికతగా మార్చడమే లక్ష్యమన్నారు. డిఆర్డిఓ మాజీ చైర్మన్, జాతీయ భద్రతా సలహా మండలి సభ్యులు డాక్టర్ జి. సతీష్ రెడ్డి, ప్రొఫెసర్ వి. రామ్ గోపాల్ రావు నేతృత్వంలో జరిగిన ఓపెన్ హౌస్ చర్చల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఒప్పంద ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రాజెక్టులను వేగంగా పట్టాలు ఎక్కించడం ప్రభుత్వ పరిశ్రమల భాగస్వామ్యంతో క్యాంపస్ లోనే సంయుక్త పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేసి సాంకేతికతను సులభంగా పరిశ్రమలకు చేరేలా సరళమైన మీదో సంపత్తి విధానాలను అమలు పరచాలని తెలిపారు. అనంతరం ఆత్మనిర్బర్ భారత్ లక్ష్యంగా రక్షణ రంగాన్ని మరింత బలోపితం చేయాలని సంకల్పంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిట్స్ బిలాని సిబ్బంది ,రక్షణ రంగ నిపుణులు, వివిధ పరిశోధన పరిశోధక సంస్థల సభ్యులు, మేధావులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Latest