Mahaa Daily Exclusive

  వరంగల్‌ నర్సంపేట రోడ్డు పై తీవ్ర ఉద్రిక్తత..! వెంకట్రామ జంక్షన్ వద్ద మృతురాలి కుటుంబ సభ్యుల రాస్తారోకో..!

Share

  • వైద్యుల నిర్లక్ష్యానికి గర్భిణీ బలి?
  • వెంకట్రామ జంక్షన్ వద్ద మృతురాలి కుటుంబ సభ్యుల రాస్తారోకో!

వరంగల్, కాశిబుగ్గ ;

వరంగల్ నగరంలోని కాశిబుగ్గ ప్రాంతంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యానికి ఓ గర్భిణీ మహిళ ప్రాణాలు కోల్పోయిందంటూ బాధితులు ఆందోళనకు దిగారు.

మృతురాలు కాశిబుగ్గకు చెందిన అస్త్రం బుటా లత కు (34). పుట్టిన శిశువు క్షేమంగా ఉన్నట్లు సమాచారం. గత మంగళవారం కాశిబుగ్గ డాక్టర్ సంధ్యారాణి ఆసుపత్రిలో లతకు ఉదయం డెలివరీ ఆపరేషన్ జరిగింది. కొద్ది సమయం లోనే ఫిట్స్ రావడంతో వరంగల్ సంరక్ష ఆసుపత్రికి తరలించారు.
సంరక్ష ఆసుపత్రిలో సరైన వైద్యం అందించక పోవడం వల్లే అస్త్రం బూటా( లత) శనివారం ఉదయం 11 గంటలకు మృతి చెందిందని కుటుంబ సభ్యుల ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మృతురాలి బంధువులు న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ రోడ్డుపై బైఠాయించడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఉద్రిక్త పరిస్థితిని అదుపు చేస్తున్నారు.

Latest