Mahaa Daily Exclusive

  వాడవాడనా అన్నదానాలు..!

Share

నేలకొండపల్లి, సెప్టెంబరు 1మహా :

మండలం లోని వివిధ గ్రామాలలో అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. సోమవారం నేలకొండపల్లి, మండ్రాజు పల్లి తండా, చెరువు మాదారం ఆజాద్ యూత్, తదితర గ్రామాలలో వినాయక మండపాల వద్ద కమిటి ప్రతినిధులు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. నేలకొండపల్లి లో జరిగిన కార్యక్రమంలో సహకార సంఘం డైరెక్టర్ హనుమంతరావు తదితరులు మండపంను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొమరగిరి హనుమంతరావు, యరపు వీరబాబు , తోట కోటేశ్వరరావు, ధరావత్ ఉపేందర్, పానుగోతు వీరబాబు, పానుగోతు ఉపేందర్, శివ, రావూరి కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. మండ్రాజూపల్లి తండా లో వివిధ రకాల నైవైద్యాలను సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Latest