కారేపల్లి, మహా : ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆగష్టు 9న ఆదివాసీ ఉద్యోగలకు సెలవుగా దినంగా ప్రకటించాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి(తుడుందెబ్బ) అధికారులకు వినతిపత్రాలు అందజేసింది. వివిధ విభాగాలలో పని చేస్తున్న ఆదివాసీ ఉద్యోగులకు సెలవు ఇవ్వటం ద్వారా ఆదివాసీ దినోత్సవం జరుపుకోవటానికి అవకాశం కల్పించాలని వినతిలో కోరారు. ఈసందర్బంగా తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు బచ్చల వెంకటేశ్వర్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ కల్తి రాంప్రసాద్‌లు మాట్లాడుతూ ఆదివాసీలు హక్కులు కోల్పోతున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీలు ఐక్యంగా హక్కుల కోసం కోమరం భీం స్పూర్తితో పోరాటాలకు సిద్దం కావాలన్నారు. ఆదివాసీ దినోత్సవాన్ని 9వ తేదిన కారేపల్లిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో తుడుందెబ్బ మండల ప్రధానకార్యద్శి ఈసం భాస్కర్, మాజీ సర్పంచ్‌లు కుర్సం సత్యనారాయణ, బిజ్జా రాము, నాయకులు కుర్సం నాగేశ్వరరావు, పెనక శ్రీనివాసరావు, కుర్సం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.







