గల్ మహా;
ములుగు జిల్లా తాడ్వాయి మండలం ఆంధ్రజ్యోతి రిపోర్టర్ శ్రీకాంత్ రెడ్డి పై బుధవారం కాంగ్రెస్ నాయకుల దాడిని ఖండిస్తూ గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ నుండి ర్యాలీగా బయలుదేరి
వరంగల్ ఎంజీఎం కూడలిలో జర్నలిస్ట్ యూనియన్ల కు అతీతంగా వరంగల్ తూర్పు జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులు తమ కలంతో సమాజాన్ని మేల్కొలుపుతూ నిబద్ధతతో చెడును చెడుగా, మంచిని మంచిగా చూపిస్తూ నిజాయితీగా వార్తల రూపంలో అందిస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల పై గత కొంతకాలంగా కొంతమంది నాయకులు అధికార పార్టీ నేతల అండదండలతో ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారని, ఇటువంటి దాడులను ప్రోత్సహించిన వారిపై, చేసిన వారి పై కూడా కఠిన చర్యలు తీసుకోని వారి పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఇంతవరకు స్థానిక మంత్రి స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జర్నలిస్టులపై ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా నిబంధనల ప్రకారం దోషుల పై కఠిన చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్లకు, సంఘాలకు అతీతంగా యావత్ జర్నలిస్ట్ కులాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేపడతామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ వరంగల్ తూర్పు వర్కింగ్ జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.







