ఆదిలాబాద్, మహా:
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ జన్మదినోత్సవ వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. గురువారం ఉట్నూర్ మండల కేంద్రంలోని టీపీసీ సీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జి ఆత్రం సుగుణక్క క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకున్నారు. ఈ సందర్బంగా సుగుణక్క మాట్లాడుతూ దేశంలోని సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజల పక్షాన నిలబడుతున్న ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ అని కొనియాడారు. త్యాగాల కుటుంబం నుండి వచ్చిన నాయకుడని ప్రధాన మంత్రి పదవి అవకాశం వచ్చినా దేశం కోసం పార్టీ కోసం పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఆదివాసి రాష్ట్ర కన్వీనర్ సునీల్ జాదవ్, పరత్వాగ్ విశాల్, తిత్రే గోవింద్,కాత్లే బుచ్చన్న,గేడాం శ్రీధర్,రాజక్క, కనక సంతోష్, తొడసం భగవంత్ రావ్,జైతు పటేల్,తదితరులు పాల్గొన్నారు.







