Mahaa Daily Exclusive

  చంద్రబాబుతో భేటీ.. విజయవాడ పర్యటకు వెళ్లిన కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి..!

Share

చంద్రబాబుతో భేటీ..
విజయవాడ పర్యటకు వెళ్లిన కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి.. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ లంచ్‌ మీటింగ్‌లో పలు అంశాలపై చర్చించారు. ఆ తర్వాత చంద్రబాబు నివాసం నుంచి విజయవాడ బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. విజయవాడ వచ్చినందుకు సీఎం చంద్రబాబు లంచ్ కి పిలిచారని తెలిపారు.. కేంద్ర సహాయం, ఏపీకి రావాల్సిన ప్రాజెక్ట్ లపై చర్చించామని వెల్లడించారు.. ఇక, విజయవాడ పర్యటనకు వచ్చినందుకు మర్యాద పూర్వకంగా కలవడానికి సీఎం చంద్రబాబు పిలిచారని తెలిపారు.. మైనింగ్, ఇతర ప్రాజెక్ట్ లపై ఈ లంచ్‌ సమావేశంలో చర్చించమన్నారు. వాటితో పాటు తాజా రాజకీయ పరిణామాలు, తెలంగాణ రాజకీయాలపై కొద్దిసేపు చర్చించినట్టు సమాచారం.

Latest