ఆదిలాబాద్, మహా:
ప్రైవేట్ వ్యక్తుల వాహనాలకు పోలీసు సైరన్ వినియోగించినట్లయితే వారిపట్ల చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రైవేట్ వ్యక్తుల వాహనాలకు అధిక శబ్దం వచ్చేలా మోడిఫైడ్ హారన్ పోలీసు సైరన్లు ఉపయోగించరాదని నిబంధనలు అతిక్రమించిన వారిపై చీటింగ్ కేసు నమోదు చేసి వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. సమాజ శ్రేయస్సు కొరకు పట్టణంలో పాఠశాలల వద్ద ఆసుపత్రుల వద్ద వృద్ధులకు చిన్న పిల్లలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారు అనారోగ్య బారిన పడకుండా ఇలాంటి చర్యలను చేపడుతున్నట్టు వివరించారు. ముఖ్యంగా ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో బుధవారం ఒక వాహనాన్ని సీజ్ చేయడం జరిగిందని తెలిపారు.
Post Views: 126







