Mahaa Daily Exclusive

  భారతమాత నుదుటిపై “సింధూరం” షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్..!

Share


షాద్ నగర్,మహా:
భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌పై షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ స్పందించారు. తీవ్రవాద శిబిరాలను పూర్తిగా తుడిచిపెట్టే శక్తి ఆర్మీకి ఉందని ఇండియన్ ఆర్మీని చూసి గర్విస్తున్నానని ఎమ్మెల్యే శంకర్ స్పష్టం చేశారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ మన భరతమాత నుదుటిన ఉన్న సింధూరం అని ఇది మొదటి శుభసంకేతమని ఆయన పేర్కొన్నారు. జమ్ము కశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిపై భారత్ ప్రతీకారం తీర్చుకుందనీ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపుదాడులకు దిగడం పాకిస్తాన్ ఇలాంటి ఉగ్రవాద దేశానికి చెంపపెట్టు లాంటిదని అన్నారు. ఈ దాడుల్లో 30 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోందనీ ఇక ఆపరేషన్ సింధూర్‌ను ప్రతీఒక్కరూ సమర్ధిస్తున్నారనీ ఎమ్మెల్యే తెలియజేశారు. అధికార విపక్ష నేతలు, భారత ప్రజలు ఇతర అగ్రదేశాల నాయకులు సైతం అందరూ కూడా ఆపరేషన్ సింధూర్‌ను సమర్థిస్తూ జైహింద్ అంటూ పోస్టులు పెడుతున్నారన్నారు. ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులపై స్పందిస్తూ ఎమ్మెల్యే శంకర్ భారత దేశ ఆర్మీకి సెల్యూట్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించాలని కోరారు. నియోజకవర్గ ప్రజల తరఫున ఆర్మీకి, ప్రభుత్వానికి ఆయన అభినందనలు తెలిపారు..

Latest