Mahaa Daily Exclusive

  రైతులు మధ్య దళారులను నమ్మి మోసపోవద్దు.. చివరి గింజ వరకు వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి..!

Share

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
రైతులెవరు అధైర్యపడవద్దని చివరి గింజ వరకు వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని మధ్య దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి అన్నారు. సోమవారం కడ్తాల్ మండల కేంద్రంలోని ముద్విన్, కడ్తాల గ్రామాల్లో వరి కొనుగోలు కౌంటర్లను ఎంపీ మల్లు రవి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా డిసిసిబి చైర్మన్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, డిసిసిబి డైరెక్టర్ ఆమనగల్ సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా, వైస్ చైర్మన్ దోనాదుల సత్యం, ఆమనగల్లు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ యాట గీతా నరసింహ, వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి, పిఎసిఎస్ పాలకవర్గంతో కలిసి వరి ధాన్యం కొనుగోలు కౌంటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రైతులకు ప్రతిరోజు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉంటాయని రైతులెవరు ఆందోళన చెందవద్దని అన్నారు. రైతన్నలకు మద్దతు ధర ఇచ్చేందుకే సింగల్ విండోల ద్వారా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. సోమవారం ఆమనగల్ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో కడ్తాల్ మండలంలోని ముద్విన్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగిందని గుర్తు చేశారు. ధాన్యం తూకం వేసిన అనంతరం డబ్బులు రైతుల ఖాతాలో జమ చేస్తున్నామని తెలిపారు. రైతులు అరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యాన్ని అమ్ముకోవాలని కోరారు. పకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటామని.. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అబద్ధపు మాటలను రైతులు నమ్మవద్దని మల్లు రవి సూచించారు. వరి ధాన్యం క్వింటాలుకు మద్దతు ధర రూ, 2320, గా ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. సన్న రకం వరి దాన్యం క్వింటాలుకు రైతులకు ప్రోత్సాహకంగా రూ. 500 బోనస్ ఇవ్వనుందని ఇప్పటికీ రైతుల ఖాతాలో బోనస్ జమ చేయడం జరుగుతుందన్నారు. రైతులకు మద్దతు ధర కల్పనకే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని రైతులు దర్జాగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లి అమ్ముకోవచ్చని సూచించారు. డిసిసిబి డైరెక్టర్ గంప వెంకటేష్ గుప్తా మాట్లాడుతూ ధాన్యం కొనుగోలుకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సింగల్ విండోల ద్వారా వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి తక్షణం మిల్లులకు తరలించడం జరుగుతుందని తెలిపారు. రైతులను మోసగిస్తే ఎంతటి వారైనా సరే చర్యలు తప్పవని వెంకటేష్ గుప్తా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సింగల్ విండో డైరెక్టర్లు జోగు వీరయ్య, బెల్లి వెంకటయ్య, చేగురు వెంకటయ్య, శ్రీ పాల్, సేవ్య నాయక్, ధో ల్యా నాయక్, వెంకటరెడ్డి, అంజిరెడ్డి, మార్కెట్ కమిటీ సభ్యులు నరేష్, మాజీ మెంబర్ లాయక్ అలీ, బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పరమేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బిచ్చ నాయక్, మాజీ ప్రజాప్రతినిధులు గోపాల్, రమేష్, చంద్రమౌళి, రామకృష్ణ, శంకర్, యాదయ్య, లోక్య నాయక్, శ్రీను, జంగయ్య, బిఖ్య నాయక్, చందోజి, హనుమా నాయక్, రమణ, సోషల్ మీడియా కన్వీనర్ కంబలపల్లి అంజి, సురేష్, కంబాలపల్లి శ్రీకాంత్, బి ఆర్ ఎస్ యూత్ వింగ్ పట్టణ అధ్యక్షుడు ఇర్షాద్, ఆమనగల్ సింగల్ విండో సీఈఓ దేవేందర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Latest