Mahaa Daily Exclusive

  బాలాపూర్‌ గణేశుడిని దర్శించుకున్న మల్‌రెడ్డి…!

Share

  • బాలాపూర్‌ గణేశుడిని దర్శించుకున్న మల్‌రెడ్డి…
  • లంబోదరుడికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు…
    మల్‌రెడ్డి రంగారెడ్డిని సన్మానించిన నిర్వాహకులు…

బాలాపూర్ సెప్టెంబర్ 22 మహా:
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్‌రెడ్డి రంగారెడ్డి బాలాపూర్‌ గణేశుడిని దర్శించుకున్నారు. గణేశ్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు మంగళవారం సాయంత్రం వినాయక మండపం వద్దకు వెళ్లిన మల్‌రెడ్డికి.. డీసీసీ అధ్యక్షురాలు పారిజాతతో పాటు నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం, విఘ్నేశ్వరుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే… ఏకదంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని కోరుకున్నట్లు మల్‌రెడ్డి రంగారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బాలాపూర్ డివిజన్ అధ్యక్షులు నీరుడు శ్రీరాములు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Latest