హనుమకొండ, మహా ;
కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ జ్యోతిని పదవి నుంచి తొలగించాలని స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఎల్తూరి సాయికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా విద్యార్థులు మరియు విద్యార్థి సంఘ నాయకులు సమస్యలను పరిష్కరించండి అడుగగా నేను ఓ మహిళ ప్రిన్సిపాల్ ను అంటూ తిరిగి విద్యార్థులనే భయభ్రాంతులకు గురి చేసే ప్రక్రియ చేస్తుందని ఆరోపించారు. అదేవిధంగా జీవోల మీద విద్యార్థులకు ఉన్న కనీస అవగాహన పరిజ్ఞానం ఏఆర్ అలాగే ప్రిన్సిపాల్ కు లేదని ధ్వజమెత్తారు. ప్రిన్సిపాల్ సమయపాలన పాటించకుండా తన ఇష్టానుసారంగా కాలేజీకి రావడం జరుగుతుంది. ప్రొఫెషనల్ మరియు నాన్ ప్రొఫెషనల్ కోర్సులకు తేడా తెలియకుండా మీకు స్కాలర్షిప్ రాదు. నేను చెప్పిందే వేదం అని భయబ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, విద్యార్థులకు విద్యార్థి సంఘ నాయకులకు కనీస మర్యాద ఇవ్వని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ జ్యోతిని పదవి నుంచి తొలగించాలి. చదువుకునే ఎస్సీ,ఎస్టీ మరియు బిసి విద్యార్థులను చదువుకోవద్దనే కుట్రలో భాగంగానే విద్యార్థులను భయబ్రాంతులకు గురి చేస్తున్న ప్రిన్సిపాల్ ను విధుల నుంచి తక్షణమే తొలగించి విద్యార్థులకు న్యాయం చేయాలని స్వేరో స్టూడెంట్స్ యూనియన్ విద్యార్థి విభాగం డిమాండ్ చేస్తుంది లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళనలు ఉద్యమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వేరో స్టూడెంట్స్ యూనియన్ విద్యార్థి నాయకులు శివ కుమార్,రాజ్ కుమార్, అభిలాష్, నాగరాజు, బంటి ,సుఖేష్ ,గణేష్ తదితరులు పాల్గొన్నారు.







