Mahaa Daily Exclusive

  మాదిగ లాయర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడిగా పి అనిల్ కుమార్ నియామకం….

Share

హనుమకొండ, మహా;

 

మాదిగ లాయర్స్ ఫెడరేషన్ జిల్లా కొత్త కమిటీల నియామకం శనివారం హనుమకొండ లోని విద్యుత్ భవన్ లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పద్మ శ్రీ మందకృష్ణ మాదిగ హాజరైయ్యారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు వివి రత్నం, రాష్ట్ర ఎంఎల్ఎఫ్ అధ్యక్షులు వీరేష్ , బార్ కౌన్సిల్ మెంబర్ బైరపాక జయకర్, సభ్యులు, న్యాయవాదులు కొంగర పూర్ణచందర్ నాగభూషణం, మాదిగ లాయర్స్ ఫెడరేషన్ – వరంగల్ జిల్లా అధ్యక్షునిగా పెండ్యాల అనిల్ కుమార్ నియమించినట్లు తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ తనపై నమ్మకాన్ని ఉంచి ఈ అధ్యక్ష పదవికి ఎన్నిక చేసినందుకు పద్మశ్రీ మాన్యశ్రీ మందకృష్ణ సూచన మేరకు తన వంతు కృషి చేస్తానని, ఎం ఎల్ ఎఫ్ న్యాయవాదుల అభ్యున్నతికి పాటు పడతానని ఈ ఎన్నికకు సహకరించిన ప్రతీ న్యాయవాది కి పెండ్యాల అనిల్ కుమార్ గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Latest