Mahaa Daily Exclusive

  కాంగ్రెస్ ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ ఎక్కడ? మేనిఫెస్టో హామీల పై ప్రభుత్వాన్ని నిలదీయాలి స్వేరో స్టూడెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సాయికుమార్..!

Share

హన్మకొండ మహా;

కాకతీయ యూనివర్సిటీ
అతిధి భవనంలో
స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు వెల్తూరి సాయికుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరికి వస్తున్న సమయంలో విద్యార్థులు నిరుద్యోగులు మహిళలు అందరూ పల్లె బాట పట్టి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదించాల్సిన అవసరం ఉందని అన్నారు.
విద్యార్థులు గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు అంతా ఏకమై వారిని ఎలక్షన్లో ఓడగొట్టి ఏరి కోరి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను మోసం చేసి విద్యార్థుల ను నమ్మించి గొంతు కోసిందని అన్నారు. అంతేకాకుండా
నిరుద్యోగులు గత ప్రభుత్వంలో అనేక ఉద్యమాలు చేసి నిరుద్యోగ జేఏసీ ఏర్పాటు చేసుకొని కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగులు అందరూ ఓటు వేయాలని ప్రచారం చేసి గద్దెనెక్కిస్తే ఈ రోజు నిరుద్యోగుల గురించి పట్టించుకోకుండా జాబ్ క్యాలెండర్ వెయ్యకుండా దివాలా తీస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగులకు అండగా నిలవాలని లేని పక్షంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి నిరుద్యోగి నిలదీయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు స్వేరో స్టూడెంట్స్ యూనియన్ ప్రజల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో స్వేరో స్టూడెంట్స్ యూనియన్ నాయకులు ప్రతాప్, అజయ్, వెంకటేష్ ,చౌదరి ,శ్రీకాంత్, మహదేవ్ ,టికాజి, రాజు, గణేష్, శివ,శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

Latest