మందమర్రి, మహా : మందమర్రి ఏరియా నూతన జిఎంగా ఎన్ రాధాకృష్ణ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్.ఓ.టు.జి.ఎం విజయప్రసాద్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, కే.కే.గ్రూప్ ఏజెంట్ రాంబాబు, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ భూ శంకరయ్య, ఐ.ఈ.డి అధికారి కిరణ్ కుమార్ ఇతర అన్ని డిపార్టుమెంట్ల హెచ్.ఓ.డీ లు పదవి బాధ్యతలు చేపట్టిన జిఎం కు పుష్పగుచ్చం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.
కే.కే.ఓ.సీ.ని సందర్శించిన జిఎం
ఏరియా జిఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన రాధాకృష్ణ ముందుగా కే.కే.ఓ.సీ. ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ ఆఫీసర్ మల్లయ్య, మేనేజర్ రామరాజు, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎన్ వెంకట వంశీధర్ లను ఉత్పత్తి ఉత్పాదకత వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భారీ యంత్రాలు (డంపర్స్, షావల్) పరిశీలించారు. యంత్రాలకు అవసరమైన విడిభాగాలు సకాలంలో అందుబాటులో ఉంచి, బ్రేక్‌డౌన్లను తగ్గించాలని. సూచనలు చేశారు. అనంతరం వినాయకుడి పూజలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు.
ఏరియా అధికారులతో సమీక్ష సమావేశం
బుధవారం పదవి బాధ్యతలు చేపట్టిన ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ ఏరియాలోని గనులు, డిపార్ట్ మెంట్ల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
భూగర్భ గనులు, ఓపెన్ క్యాస్టు ల
పనితీరుల గురించి అడిగి తెలుసుకున్నారు. సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు అందరు అధికారులు సమన్మయంతో కృషి చేయాలని వెల్లడించారు.







