Mahaa Daily Exclusive

  ప్రపంచ అర్చరీ చాంపియన్ తెలంగాణ ముద్దుబిడ్డ చికిత కు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఘనంగా స్వాగతం పలికిన మంత్రి వాకిటి శ్రీహరి…!

Share

రాజేంద్రనగర్ మహా ; కెనడాలో ప్రపంచ ఆర్చరీ యూత్ ఛాంపియన్‌షిప్స్‌లో ఇండియా తరఫున చరిత్ర సృష్టించిన తెలంగాణ ముద్దుబిడ్డ చికితకు‌ క్రీడాశాఖమంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే విజయరమణారావు,
,ఎమ్మెల్సీ బల్మురి వెంకట్,స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఘనంగా స్వాగతం పలికిన
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన చికిత తానిపర్తిని మంత్రి అభినందించారు. భవిష్యత్తులో మరెన్నో విజయాలు దేశానికి అందించాలని కోరారు.
ప్రపంచ ఆర్చరీ యూత్ ఛాంపియన్‌షిప్స్‌లో అండర్-21 మహిళల విభాగంలో‌ చికిత స్వర్ణ పతకం సాధించారు. శంషాబాద్ ఎయిర్పోర్టు వద్ద భారీగా చికిత అభిమానులు చేరుకున్నారు. అభిమానుల మధ్యలో ఓపెన్ టాప్ జీపులో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ నగరానికి బయలుదేరారు.

Latest