బోనకల్ మహా ఆగస్టు 13
వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం, రాబోయే రెండు మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో బోనకల్ మండలం స్థానిక ఎస్సై వెంకన్న మండల ప్రజలకు, లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలకు పలు జాగ్రత్త సూచనలు తెలిపారు.ఈ సందర్భంగా బోనకల్ ఎస్సై వెంకన్న మాట్లాడుతూ, “భారీ వర్షాల పరిస్థితుల్లో ముందస్తు చర్యలు తీసుకోవడం అత్యవసరం. స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ.వర్షం పడుతున్న సమయంలో కరెంటు స్తంభాలకు, ట్రాన్స్ఫార్మర్లులకు, దూరంగా ఉండాలని, తడిచిన స్విచ్ బోర్డులను, విద్యుత్ పరికరాలను ముట్టుకొని వినియోగించద్దని,మురికి నీరు పై చేరే దోమల వల్ల అనారోగ్యానికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.అత్యవసర పరిస్థితుల్లోనే పిల్లలు, వృద్ధులు బయటకు రావాలన్నారు.పోలీసులు వర్షాల సమయంలో ప్రమాదాలు నివారించేందుకు పౌరులు సహకరించాలని, రహదారులపై నీరు చేరిన ప్రాంతాలను దాటకూడదని, రానున్న ఈ మూడు రోజుల భారీ వర్షాలకు ప్రజలు జాగ్రత్తలు వహించాలని, బోనకల్ ఎస్సై వెంకన్న మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.







