జూలూరుపాడు, ఆగస్టు 08, (మహా) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పవిత్ర శ్రావణ శుక్రవారం సందర్భంగా మండలంలోని ఆలయాల్లో మహిళలంతా వ్రత పూజా కార్యక్రమాలతో నూతన శోభ సంతరించుకుంది. జూలూరుపాడు మండల పరిధిలోని కాకర్ల గ్రామంలోని పాలగుట్టపై కొలువై ఉన్న శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా మహిళలు వరలక్ష్మి వ్రత పూజా కార్యక్రమాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పవిత్ర శ్రావణ శుక్రవారం కావడంతో వేణుగోపాల స్వామి ఆలయానికి మహిళలు తెల్లవారుజాము నుంచే పోటెత్తారు. ఆలయ కమిటీ చైర్మన్ ఢిల్లీ వెంకటేశ్వర్లు వేణుగోపాల స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలలో పాల్గొన్న భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేశారు.
Post Views: 70







