Mahaa Daily Exclusive

  ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు…..!

Share

తలమడుగు మహా:
ప్రొఫెసర్ జయశంకర్ కృషివల్లే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని ఎమ్మార్వో రాజ్ మోహన్ అన్నారు. తలమడుగు మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో అధికారికంగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపెళ్లి జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పువ్వులు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తహసిల్దార్ రాజ్ మోహన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకై ప్రొఫెసర్ జయశంకర్ చేసిన సేవలు రాష్ట్ర ప్రజలు మర్చిపోలేరని రాష్ట్ర ప్రజల గుండెల్లో ఎప్పుడు చిరస్మరణీయంగా గుర్తుండిపోయే నాయకుడని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ ప్రభాకర్, ఆర్ఐ రోహిదాస్, అశోక్ సిబ్బంది లింగన్న, నరేందర్, హరీష్ తదితరులున్నారు.

Latest