Mahaa Daily Exclusive

  నేడు ప్రజా వేదిక ను విజయవంతం చేయండి..!

Share

నేలకొండపల్లి, ఆగస్టు 5 మహా:

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పధకం కు సంబంధించిన సామాజిక తనీఖీ ప్రజా వేదిక కార్యక్రమం బుధవారం మండల కేంద్రంలోని ఈజీఎస్ కార్యాలయం లో నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ యం.యర్రయ్య తెలిపారు. మంగళవారం తన చాంబర్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు..మండలం లోని 32 గ్రామ పంచాయతీలలో ఏప్రిల్-1, 2024 నుంచి 31, మార్చి 2025 వరకు జరిగిన పనుల పై సామాజిక తనీఖీ ప్రజా వేదిక ను నిరవహించనున్నట్లు తెలిపారు. ఆయా గ్రామాలలో జూలై 25 నుంచి ఆగస్టు 5 వరకు 32 గ్రామ పంచాయతీలలో క్షేత్ర స్థాయిలో సామాజిక తనీఖీ సిబ్బందిచే నిర్వహించిన తనీఖీ నివేదిక లపై బుధవారం ఉదయం 10 గంటలకు ప్రజా వేదిక ను నిర్వహించనున్నట్లు తెలిపారు. కావునా ఉపాధి హమీ పథకం కూలీలు, మేట్లు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు సకాలంలో హజరు కావాలని కోరారు. ఈ విలేకర్ల సమావేశంలో ఈజీఎస్ ఏపీవో ఆర్.సునీత, ఈసీ శేషగిరిరావు లు ఉన్నారు.

Latest