Mahaa Daily Exclusive

  ‘స్థానికంపై’ ఇంకా నిర్ణయం తీసుకోలేదు మంత్రివర్గంలో చర్చించిన తర్వాతే ఫైనల్ =బనకచర్ల విషయంలో తగ్గే ప్రసక్తే లేదు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు ..!

Share

నిజామాబాద్, మహా: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీకి నేర చరిత్ర ఉందని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నిజామాబాద్ లో అదివారం ఆయన మాట్లాడుతూ.. పారిశ్రామికవేత్తలు, జడ్జీలు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సహా మొత్తం 650 మంది ఫోన్‌లు ట్యాప్‌ చేసిన చారిత్రక దౌర్భాగ్యానికి బీఆర్ఎస్ పార్టీ పాల్పడిందని పేర్కొన్నారు. మా లాంటి నాయకుల ఫోన్‌లతో పాటు, రాష్ట్రంలోని పలువురు ప్రముఖుల ఫోన్‌లు ట్యాప్ చేశారని ఆయన మండిపడ్డారు. ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద నేరమని, ఈ వ్యవహారంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన హెచ్చరించారు.

వెనక్కి తగ్గం..
కేసీఆర్, కేటీఆర్‌ల ప్రమేయంతోనే ఈ ఫోన్ ట్యాపింగ్‌ జరిగినట్లు తమ అనుమానం అని స్పష్టం చేశారు. ట్యాప్ అయిన వారందరూ స్వచ్ఛందంగా విచారణకు హాజరుకావాలని మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. ‘సిట్‌ను మేము కోరుతున్నాం. ట్యాప్ అయిన 650 మంది పేర్లను బహిర్గతం చేయాలి. ప్రభుత్వ విధానాలే ప్రశ్నార్ధకంగా మారాయి’ అని అన్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆయన మరోసారి విమర్శలు చేశారు. ‘కాళేశ్వరం పేరుతో కోట్లు నదుల్లో కలిపారు. నాసిరకం పనులతో ప్రజాధనాన్ని వృథా చేశారు,” అని ఆరోపించారు. బనకచర్ల విషయంలో కాంగ్రెస్ వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఇంకా ప్రభుత్వ నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ‘మంత్రివర్గంలో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాం’ అని తెలిపారు.

Latest