రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
మన్సాన్పల్లి గ్రామంలో రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో వందమందికి పైగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సవిత ఇంద్రారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం మనసాన్పల్లి గ్రామ నాయకులు ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డికి ఘన స్వాగతం పలికారు. యువ నాయకుడు రాఘవేంద్ర రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా బిఆర్ఎస్ కండువా కప్పుకుని పార్టీలో చేరడం జరిగింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో విఫలమైందంటూ ప్రభుత్వంపై, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు అందరూ కేసీఆర్ వైపు వస్తున్నారు. రైతులు కెసిఆర్ ను ముఖ్య మంత్రిగా కోరుకుంటున్నారని ఆమె అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరుగారెడ్డి ల పేరుతో అధికారంలోకి వచ్చి పేద ప్రజలను నట్టేట ముంచిందని వారిని పట్టించుకున్న పాపాన పోలేదని పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
ఓఆర్ఆర్ రైతు ఖాతాలో రైతుభరోసా నిధులు జమ చేయాలి…
రైతులకు వానాకాలం పంట పెట్టుబడి సాయం కొంతమందికే అందించి మరికొంతమందికి మొండి చేయి చూపడం జరిగిందని ఆమె మండిపడ్డారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని రైతులకు రైతు భరోసా నిలిపివేయడం ప్రభుత్వం పనితీరుకు నిదర్శనమని రైతుల పట్ల కక్ష సాధింపు చర్యలు తగదని ఆమె కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం మండలంలోని ప్రతి ఒక్క రైతుకి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆ పార్టీ యొక్క విధివిధానాలు, ఒంటెద్దు పోకడలు నచ్చక, కెసిఆర్ పాలనలోనే రైతులకు న్యాయం జరిగిందని, పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయని నమ్మి, మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని కోరుతూ పార్టీలో చేరడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుందని కొందరు నాయకులు బెదిరిస్తూ, కండువా కప్పుకుంటేనే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, ఇలాంటి రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. పైన ఏ ప్రభుత్వం ఉన్న ఇక్కడ మీ ఆశీస్సులతో సబితమ్మ ఉంది అని అన్నారు. ప్రజల సొమ్ముతో ఇందిరమ్మ ఇళ్లు కడుతున్నారు. గాంధీ భవన్ నుంచి ఏమైనా ఇస్తున్నారా అని ప్రభుత్వంనీ ప్రశ్నించారు. మన్సాన్పల్లి గ్రామం నుండి రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లో చేరడంతో, మహేశ్వరం మండలంలో పార్టీకి మరింత బలం చేకూరిందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు సముచితస్థానం లేదు…
రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలో శూన్యం అన్నారు. 16 నెలలు గడుస్తున్నా ప్రభుత్వ సంక్షేమ పధకాలు పూర్తిగా అమలు కాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు సముచిత స్థానం లేదని అందుకే బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.







