మంచిర్యాల, మహా : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఎప్పటికప్పుడు ప్రజలకు ప్రచారం చేస్తూనే ఉందని భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర(సిబిఐ) కార్యదర్శి కూనంనేని సాంబశివరావు న్పష్టం చేశారు. శనివారం మంచిర్యాల ఎం కన్వర్షన్ హాలులో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుకూ, కేంద్రంలోని మోడీ నర్కార్ ప్రభుత్వం పీడిత ప్రజలు, కార్మిక వర్గం పై ఆజమాహిసి చెలాయిస్తూ, ఇష్టానుసారంగా ప్రజావ్యతిరేక పాలన సాగిస్తుందని విమర్శించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర రేవంత్ రెడ్డి నర్కార్ కూడా ఆ ప్రజావ్యతిరేక విధానాలకు అదిగులకు మరుగులు ఒత్తుతూ వత్తాసు పలుకుతుందని ఆరోపించారు. బిజెపి భావజాలంతో కమ్యూనిస్టులు ఉండకూడదని ఎత్తులకు పై ఎత్తులువేస్తూ ఇటీవల మావోయిస్టులను ఏరివేత పేరుతో కాల్చి చంపడం నరికాదని స్పష్టం చేశారు. మావోయిస్టులను శాంతిచర్చల పేరిట మార్చాలి గానీ బాసిస్టు భావజాలంతో చంపడు నరికాదన్నారు. ప్రపంచంలో మూడవ ఆర్ధిక దేశంగా భారతదేశ ఎదిగినట్లు చెప్పుకుంటున్న మోడీ నర్కార్ అన్నింటా వెనుకబడి ఉందని గమనించాలని ఆకలిచావూలు, వైద్య విద్య రంగంలో ఇంకా అనేక విధానాలుగా వెనుకబడటంతో పాటు అప్పులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కగాన్ ఆపరేషన్ పేరుతో కేంద్రం చేపట్టిన మావోయిస్టు ఏరివేతకు కేంద్రంకు రాష్ట్రం జాయింట్ ఆపరేషన్ పాల్గోనడంను సిపిఐ వ్యతిరేకిస్తుందని వివరించారు.
ఇక రాష్ట్ర ప్రభుత్వం బనకచర్చ వివాదం విషయంలో ముఖ్యమంత్రి అఖిలపక్ష సమావేశం ను ఏర్పాటు చేసి జల నిపుణుల అభిప్రాయాలు సేకరించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. చంద్రబాబు గోదావరి నది వృధాగా కలుస్తున్న మూడువేల టిఎంసిల నీటిని వాడుకోవడానికి బనకచర్ల కడితే తప్పేండని అనడు నరికా దని ఆ నీరు తెలంగాణ ప్రాంత హక్కు అని అన్నారు. వెంటనే తెలంగాణ రైతుల దృష్టిలో ఉంచుకుని తక్షణమే ఈ నిర్ణయం ను మార్చుకోవాలని సిపిఐ నూచిస్తుందన్నారు. కాళేశ్వరం నిర్మాణం ఎవరిది తప్పు అనేది త్వరలో కోర్టు నిర్ణయిస్తుందని ఇందులో ఇంజనీర్లుగా పని చేసిన ఎన్ఐ, ఇఇల వద్ద వందల కోట్లు దొరకడం అవినీతి జరిగించనడానికి నిదర్శనం అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వైఎస్ఆర్ ఉన్న సమయంలో రూపకల్పన చేసుకునే తరుణంలో ఉన్న ప్రాణహిత చేవెళ్ళ ఎత్తిపోతల పథకంను ఇప్పుడు తిరిగి నిర్మించాలని ప్రభుత్వానికి సూచించారు. దీని వల్ల ఆదిలాబాద ఉమ్మడి జిల్లా రైతులకు జలవనరులు పెరగడంతో పాటు ఎల్లంపల్లి ప్రాజెక్టులోని నీటిని మళ్ళించడానికి తక్కువ ఖర్చుతో పథకం పూర్తవుతుందన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జాతీయ కార్యవర్గనభ్యులు చాడ వెంకటరెడ్డి రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు కలవేన శంకర్, రాష్ట్ర కార్యవర్గసభ్యులు వాసిరెడ్డి సీతారామయ్య, జిల్లా కార్యవర్ధనభ్యులు మేకల దాను, పట్టణ కార్యదర్శి కలీండర్ ఆలీఖాన్, ఎఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి లింగం రవి తదితరులు పాల్గొన్నారు.







