Mahaa Daily Exclusive

  నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం..!

Share

ఆదిలాబాద్, మహా
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శనివారం జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్లో నిర్వహిస్తున్నట్లు అయుష్ మెడికల్ ఆఫీసర్ చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం రిమ్స్ ఆవరణలోని అయుష్ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోస్టర్లను విడుదల చేసి మాట్లాడారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మే 27 నుంచి 25 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. పాఠశాలలు, గ్రామాలు, అంగన్వాడీ కేంద్రాల్లో యోగా ప్రాముఖ్యతను గురించి తెలియజేసినట్లు చెప్పారు. హరిత యోగా కార్యక్రమంలో భాగంగా 27 అయుష్ కేంద్రాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టామన్నారు. చివరి రోజు శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ముగింపు కార్యక్రమం నిర్వహిస్తామని వివరించారు. రెవెన్యూ గార్డెన్ ఉదయం 6.30గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు
యోగా అవగాహనతో పాటు అసానాలు వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యేతో పాటు అధికారులు, పట్టణ ప్రముఖులు హజరు కానున్నారని తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

Latest