Mahaa Daily Exclusive

  ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అభయ మై టాక్సీ ఇస్ సేఫ్ కార్యక్రమానికి శ్రీకారం..!

Share

ఆదిలాబాద్, మహా

నేరాల నియంత్రణతో పాటు ప్రజల భద్రతకు పోలీసు యంత్రాంగం అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లలో తొలిసారిగా నిర్వహించిన అభయ మై టాక్సీ ఇస్ సేఫ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ఆటో లకు క్యూఆర్ కోడ్ లను అందించారు. క్యూ ఆర్ కోడ్ లకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించి ఆటోలకు అందచేశారు. దాదాపు మూడు వందల ఆటో లకు క్యూ ఆర్ కోడ్ స్కానర్ లను అందించారు. భారి ఎత్తున ఆటోలు తరలిరావడంతో మైదాన ప్రాంగణం కిక్కిరిసి కనిపించింది. క్యూ ఆర్ కోడ్ పని చేసే విధానం, దాని ద్వారా కలిగే లాభాలు ఇతరత్రా అంశాలను వివరించారు. ప్రతి ఆటోకు ప్రత్యేకంగా నంబర్ కేటాయించడంతో పాటు క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే ఆటో డ్రైవర్ వివరాలు, ఆటో రిజిస్ట్రేషన్ నంబర్ కనబడేలా ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ఆటో ఎక్కిన వెంటనే క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే అందులో ఆప్షన్లు వస్తాయి. ట్రాక్ మై లొకేషన్ ఆప్షన్ ను ఎంచుకుంటే నేరుగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వార అనుసంధానం చేయబడి ఉన్నందున సెంటర్ నుండి ఫోన్ ను ట్రాక్ చేయడంతో పాటు సమాచారం తెలుసుకునే వీలు కల్పిస్తున్నారు. అనంతరం పలువురు ఆటో యూనియన్ ప్రతినిధులు ఎస్పీని సత్కరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ…. నేరాలు జరిగిన సమయంలో ఆటోలను కనుక్కోవడం కష్టతరంగా మారిందని, ఇందుకు పరిష్కారంగా పొలిసు శాఖా తరపున నంబర్లు కేటాయించి క్యూ ఆర్ స్కానర్ ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. జిల్లలో 3232 ఆటోలకు క్యూ ఆర్ కోడ్ లు అందించడం జరిగిందన్నారు. క్యూ ఆర్ కోడ్ ఉపయోగించే తీరును వివరిస్తూ ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వీటి ద్వార ప్రయాణికులతో పాటు ఆటోలకు సైతం భద్రత ఉంటుందని పేర్కొన్నారు. అభయ మై టాక్సీ సేఫ్ లో భాగంగా మూడు వందల యాభై రూపాయలు చెల్లిస్తే సంవత్సరం పాటు లక్ష రూపాయల బీమా వర్తిస్తుందని, ఆటో యజమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమం లో ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్, డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐ లు సునీల్ కుమార్, కరుణాకర్ రావు, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.

Latest