Mahaa Daily Exclusive

  బల్దియా కమిషనర్ గా చాహత్ బాజ్ పయ్..!

Share

వరంగల్ మహా;

కరీంనగర్ నగర పాలక సంస్థ కమిషనర్ గా పనిచేస్తున్న చాహత్ బాజ్ పయ్ ను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ నూతన కమిషనర్ గా నియమిస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
2019 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన చాహత్ బాజ్ పయ్ గతంలో ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా, ఆసిఫాబాద్
అదనపు కలెక్టర్ గా పనిచేశారు .
ఆంధ్రప్రదేశ్ లోని
నందియాల్ లో సబ్ కలెక్టర్ గా మొదటి పోస్టింగ్ అనంతరం తెలంగాణ ఐఏఎస్ క్యాడర్ కు అలౌట్ అయ్యారు.
ఐఐటీ కాన్పూర్ నుండి బి టెక్ ఎలెక్ట్రోనికల్ ఇంజనీరింగ్ చేశారు.
బల్దియా కమిషనర్ గా 14.3.2024 నుండి
పనిచేస్తున్న డాక్టర్ అశ్విని వాకడేను కరీంనగర్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు )గా ప్రభుత్వం బదిలీ చేసింది.

Latest