కాటారం, మహా :
అంగన్వాడీ సెంటర్లో 10 నుంచి 17 వరకు జరిగే అమ్మ మాట అంగన్వాడి బాట ప్రోగ్రాంలో భాగంగా కాటారం అంగన్వాడి సెంటర్లో బడిబాట నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ శివరాణి మాట్లాడుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమ్మ మాట అంగన్వాడీ బాట ప్రత్యేక ప్రోగ్రాంను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.అంగన్వాడీలో పిల్లలు స్వేచ్ఛగా నేర్చుకునేందుకు రంగురంగుల బొమ్మలు పుస్తకాలు ఆట వస్తువులు ఉంటాయి. పిల్లల అభివృద్ధికి దోహదపడేందుకు ప్రియదర్శని సిలబస్ ద్వారా టీచరు పిల్లలకు ప్రత్యేక అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఇంగ్లీషు,తెలుగు రైమ్స్ కథలు వివిధ అంశాలపై సంభాషణ ఆటలు, డ్రాయింగ్ కలరింగ్ ఆక్టివిటీస్ ద్వారా పిల్లలకు విద్యను చెప్పడం జరుగుతుంది. అంగన్వాడి సెంటర్లో పిల్లలు ఆడుకునేందుకు భాషాభివృద్ధికి మరియు సాంఘిక భావోద్వేగ అభివృద్ధికి అవకాశం కల్పిస్తున్నారు. అలాగే పూర్వ పటనo, లిఖిత, వ్రాత నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు కూడా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
అంగన్వాడి సెంటర్ పరిధిలోని లబ్ధిదారులు అందరు కూడా అంగన్వాడి లో అందించే సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి . రెండున్నర సంవత్సరాల నుండి మూడు సంవత్సరాల లోపు పిల్లలను అంగన్వాడీ సెంటర్ కి పంపించి వారి బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయాలని చెప్పారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎన్జీవో కోఆర్డినేటర్ సమ్మయ్య మాట్లాడుతూ పిల్లలకు అంగన్వాడి సెంటర్లో కార్నర్స్ ద్వారా విద్యను అందిస్తున్నామని, ఈ కార్నర్స్ ద్వారా పిల్లలకు శారీరక అభివృద్ధి సామాజిక భావోద్వేగా, నైతిక అభివృద్ధి మేధో అభివృద్ధి భాష మరియు అక్షరాస్యత అభివృద్ధి సౌందర్య సాంస్కృతిక అభివృద్ధి ఉంటాయని వీటి ద్వారా పిల్లల కు మంచి అలవాట్లు సంభాషణ కథలు,పాటలు ఆటలు సృజనాత్మకత పూర్వ అక్షరాస్యత నైపుణ్యాలు పూర్వ గణిత భావనలో శాస్త్రీయ పరిజ్ఞానం ఆటపాటలతోటి కూడిన విద్యను అందిస్తున్నట్లు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ విమల, శ్యామల ప్రేమలత, కృష్ణవేణి,కిశోర బాలికలు పిల్లల తల్లులు పాల్గొనడం జరిగినది.







