Mahaa Daily Exclusive

  కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరగాలి ఎన్ డీఎస్ఏ రిపోర్టు తప్పెలా అవుతుంది కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో గత అవినీతిపై ఎలాంటి చర్యలు లేవు చిట్ చాట్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..!

Share

మహా : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, కుంగిపోవడం తదితర అంశాలన్నింటిపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయ.పడ్డారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిగి బాధ్యలపై చర్యలు తీసుకుంటారన్న నమ్మకం లేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ అవినీతిపై విచారణ జరిపిస్తామని, బాధ్యలపై కఠిన చర్.లు తప్పవని పదే పదే ప్రకటించిన ప్రస్తుత సీఎం ఏడాదిన్నర దాటినా ఎలాంటి విచరణ జరిపించడం లేదు, ఎవరిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి ఝరిగింది వాస్తవం, అయితే ఈ అక్రమాలను ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం వెలికి తీయడంలో వెనక్కు తగ్గింది కాబట్టి ప్రజలకు పూర్తి వాస్తవాలు తెలియాలంటే సీబీఐ విచారణ ద్వారానే సాధ్యమవుతుందన్నారు. కాళేశ్వరం కమిషన్ ముందు ఎంపీ ఈటల రాజేందర్ అదే చెప్పారన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో కర్త, కర్మ, క్రియ అన్నీ కేసీఆర్ అని ఆయన స్పష్టంగా తెలిపారన్నారు. మొదటి నుంచి కేసీఆర్ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలకు బాధ్యడని పేర్కొన్నారని, కమిషన్ ముందూ అదే చెప్పారన్నారు. కేసీఆర్ మీద చర్యలు తీసుకోవాలని ఈటెల చెప్పారన్నారు. మాజీ మంత్రిగా ఈటల రాజేందర్ ను విచారణకు పిలిచిందని, బీజేపీ నేతగా పిలవలేదన్నారు. మంత్రిగా తానున్న కాలంలో ఏం ఝరిగిందన్న విషయాన్ని ఈటల కమిషన్ కు చెప్పారన్నారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి అవినీతికి పాల్పడిన మంత్రులు, ఎమ్మెల్యే ల పై చర్యలు తీసుకుంటామని చెప్పారని, ఇంతవరకు ఎవరిపై ఎవరిపై చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ కు పగుళ్ళు వచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఎన్ డీఎస్ ఏ రిపోర్ట్ తప్పు ఏవిధంగా అవుతుందో మాడజీ మంత్రి హరీష్ రావు చెప్పాలన్నారు. అందుకే ఈ వ్యాఖ్యలన్నింటికీ పూర్తి సమాధానం రావాలంటే సీబీఐ దర్యాప్తు జరిగితేనే పుల్ స్టాప్ పడుతుందన్నారు. కేసీఆర్ కుటుంబ అక్రమాలని ప్రశ్నించాడు కాబట్టే ఈటల బయటికి వచ్చాడని అన్నారు.
లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ ప్రజల కి ఎంత వరకు పనికొచ్చిందో గత పాలకులే చెప్పాలన్నారు.

జీతాలివ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్‌ ప్రభుత్వం గ్రామాల్లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉందన్నారు. ఏడు నెలలుగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని వీధిలైట్ల నిర్వహణకు నిధుల కొరత ఉందన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ తెలంగాణను అప్పుల రాష్ట్రంగా చేస్తే.. అదే విధానాన్ని కాంగ్రెస్‌ కొనసాగిస్తోందని విమర్శించారు. చెరువుల కబ్జాను అరికట్టే చట్టం గతంలో కూడా ఉందని.. పాత చట్టానికే కాంగ్రెస్‌ ప్రభుత్వం హైడ్రా అని పేరు పెట్టిందన్నారు. మెట్రో రెండో దశకు కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుందని, అది తమ బాధ్యత అని స్పష్టం చేశారు. మెట్రోపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ ఇవ్వలేదని, అయినప్పటికీ తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు ఒక్క భాజపాకు మాత్రమే ఉందని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు.

బనకచర్లపై మరోసారి కేంద్రానికి రేవంత్ లేఖ రాయాలి

బనకచర్ల ప్రాజెక్టుపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచర్ల విషయంలో కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి మరో లేఖ రాయాలని సూచించారు. తెలంగాణకు అన్యాయం జరగడానికి వీళ్లేదని తేల్చి చెప్పారు. గత వారం ఏపీ ప్రభుత్వం డీపీఆర్ ఇచ్చింది. కేంద్రం ఇంకా ఆ నివేదికను పరిశీలించలేదు. ఆవేమీ తెలుసుకోకుండా కేంద్రంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. కేంద్రం పెద్దన్న పాత్రలో ఉంది కాబట్టి.. ఇరువైపులా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఒకరికి అన్యాయం, మరొకరికి న్యాయం చేసేలా కేంద్రం వైఖరి ఎప్పుడూ ఉండదు. కేంద్రం ఎల్లప్పుడూ నిష్పక్షపాతంగా ఉంటుందని అన్నారు.

రాష్ట్రంలో అధికారంలోకి రావడమే నా అజండా

తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకు ఱావడమే తన ఎజండా అని కిషన్ రెడ్డి చెప్పారు., త్వరలో జరుగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర పీఠాన్ని బీజేపీ అధిష్టించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రోజురోజుకూ బీజేపీకి తెలంగాణ బలం పెరుగుతుందని, అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆ బలం నిరూపితమవుతుందన్నారు.

Latest