రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
ప్రజా ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. బుధవారం ప్రజా భవన్ కార్యాలయంలో ఇబ్రహీంపట్నం, మంచాల మండలాలకు చెందిన లబ్దిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయాలకు అతీతంగా ప్రతి నిరుపేద కుటుంబానికి న్యాయం జరిగే విధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు అందుకున్న కుటుంబాలు దుర్వినియోగం చేసుకోకుండా, సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ పాండురంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొంగర విష్ణువర్ధన్ రెడ్డి గుండెమోని జయమ్మ, బైరిక రమాకాంత్ రెడ్డి, ప్రేమాకర్ రెడ్డి, మార సురేష్, కంబాలపల్లి బుగ్గరాములు, దాసరమోని అశోక్, పూజరి ప్రభాకర్, నవీన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు







