హన్మకొండ మహా;
గోలి గోపాల్ రెడ్డి అనే వ్యక్తి 2015 సం.లో హనుమకొండ లోనివరంగల్ ఆఫీసర్ క్లబ్ లో అప్పటి జాయింట్ సెక్రెటరీ ద్వారా నేను దానికి మేనేజర్ గా జాయిన్ అయ్యాడు. ఎలాగైనా సులభంగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకొని, ఎవరైన క్లబ్ లో మెంబర్ షిప్ కోసం క్లబ్ కు వస్తే వారికి క్లబ్ ఎంట్రీ ఫీజు రూ.1,40,000/-వుంటుందని చెప్పడం తో వారు జాయిన్ కావడానికి వస్తే వారి వద్ద నుండి జాయినింగ్ ఫీజు తీసుకొని వారికి ఒక ఐడి కార్డ్ ను ఇచ్చాడు, కానీ వారి వివరాలు మాత్రం క్లబ్ మినట్స్ బుక్ లో ఎంట్రీ చేసే వాడు కాదు. అట్టి డబ్బులను స్వంత ఆవసరాలకు వాడుకునేవాడు. ఇలా మొత్తంగా కలిపి సుమారు రూ.1,30,00,000/- ల వరకు తీసుకొని వాటిని క్లబ్ అకౌంటు లో కట్టలేదు. అదే విధంగా 2019 సం.లో అప్పటి జాయింట్ సిక్రెటరీ అయిన చెరుకు వెంకట రాజీరెడ్డి కూడా సుమారు కొంత మంది వ్యక్తులను క్లబ్ లో జాయిన్ కావడానికి తీసుకొని వచ్చి, అందులోని ముగ్గురికి సంబంధించిన డబ్బులు 4,20,000/- డబ్బులను గోలి గోపాల్ రెడ్డికి ఇవ్వగా వాటిని కూడా క్లబ్ అకౌంటు లో జమ చేయకుండా వాడుకున్నాడు. అలాగే సదరు చెరుకు వెంకట రాజీరెడ్డి మిగతా వారి వద్ద నుండి తీసుకున్న డబ్బులు సుమారు రూ.60,00,000/- ల వరకు తన స్వంత అవసరాలకు వాడుకొన్నాడు.
ఆ సమయం లో గోలి గోపాల్ రెడ్డి కి క్లబ్ లో షటిల్ బాయ్ గా పని చేసే పొడిశెట్టి రవీందర్ పరిచయం కావడంతో అతనికి కూడా ఎవరైనా క్లబ్ లో జాయిన్ కావడానికి వుంటే తీసుకరా కమిషన్ ఇస్తానని చెప్పగా అతను కూడా ఏడుగురిని వ్యక్తులను తీసుకరావడంతో ఒక్కొక్కరి వద్ద నుండి రూ.1,50,000/- రూపాయలు ఎంట్రీ ఫ్రీ గా తీసుకొని వారికి ఐడి కార్డ్స్ ఇచ్చారు. ఆ తరువాత కూడా మరో 7 మందిని తీసుకొని రాగా వారి ఒక్కొక్కరి వద్ద నుండి రూ. 2,00,000/- తీసుకొని వారికి కార్డ్స్ ఇచ్చి వారి వద్ద తీసుకున్న డబ్బులను కూడా క్లబ్ అకౌంటు లో కట్టకుండా స్వంతానికి వాడుకున్నాడు. ఈ డబ్బుల లో నుండి సదరు పొడిశెట్టి రవీందర్ కు పలు ధపాలుగా కలిపి రూ. 10,00,000/- ల వరకు ముట్ట చెప్పాడు. ఈ విషయం క్లబ్ బార్ లో పనిచేసే శ్రీనివాసు కు తెలియడంతో అతడిని కూడా కొంత మందిని తీసుకొస్తే, అతనికి కూడా కొంత కమిషన్ ఇస్తామని గోలి గోపాల్ రెడ్డి, రాజీ రెడ్డి, రవీందర్ లు కలిసి శ్రీనివాసు కు ఆశ చూపారు. అందుకు మేము శ్రీనివాసు కు రూ.10,00000/- రూపాయలు ఇస్తామని చెప్పిన తరువాత ముగ్గురు మాట మార్చి డబ్బులు ఎక్కడివి, ఇచ్చేదే లేదు ఏమి చేసుకుంటావో చేసుకో అని చెప్పడంతో, అతను తేదీ, 18.04.2024 రోజు సాయంత్రం క్లబ్ లో మొదటి అంతస్తు లో నవారు పట్టి తో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని చనిపోయారు. అతని చావు కి కారణమం గోలి గోపాల్ రెడ్డి, రాజి రెడ్డి, రవీందర్ అనే వీడియో తన కుమారుడి మొబైల్ కు పంపడం జరిగింది. ఆ విషయం లో సుబేదారి స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఆ తరువాత క్లబ్ లో కమిటీ వేసి విచారణ చేయగా సదరు గోలి గోపాల్ రెడ్డి సుమారు రూ. 1,30,00,000/-, అలాగే చెరుకు వెంకట రాజీరెడ్డి సుమారు రూ. 60,00,000/- పొడిశెట్టి రవీందర్ సుమారు రూ.10,00,000/-, క్లబ్ లో ఎంట్రీ పెట్టకుండా వారి స్వంత అవసరాలకు వాడుకున్నట్టుగా క్లబ్ కమిటీ నివేదిక సమర్పించింది. ఈ ముగ్గురు కుమ్మక్కు అయ్యి మొత్తంగా రూ.2,00,00,000/- క్లబ్ లో ఎంట్రీ పెట్టకుండా వారి స్వంత అవసరాలకు వాడుకున్నారు.
వీరు సుమారు 145 సభ్యులకు మాయమాటలు చెప్పి డబ్బులు తీసుకున్నారు. ఈ విషయం లో వారి మీద సుబేదారి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయిందని తెలిసి వారు ముగ్గురు కలిసి క్లబ్ వాళ్ళతో మాట్లాడుకుండామని ఆఫీసర్ క్లబ్ కి రావడంతో సుబేదారీ పోలీస్ వారు వచ్చి వీరిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసు దర్యాప్తు లో ప్రతిభ కనబరిచనిన సబ్ ఇన్స్పెక్టర్ రామరావు, ఏఎస్ఐ వేంకటేశ్వర రావు, హెచ్ సి లు- శ్రీనివాసస్వామి, రోషన్ అల్, పీసిలు- ఉమేశ్, దేవేందర్ లను సుబేదారి ఇన్స్పెక్టర్ పి. సత్యనారాయణ రెడ్డి అభినందించారు.







