మహా: సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోలు, వ్యవసాయం, వర్షాకాల ముందస్తు ప్రణాళిక ,ఇందిరమ్మ ఇల్లు, భూభారతి, తదితర అంశాలపై మంత్రులు దామోదర్ రాజనర్సింహ, కొండా సురేఖ, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, జిల్లా కలెక్టర్ సంగారెడ్డి క్రాంతి వల్లూరు, మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరితో పాటు సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రులు ఉమ్మడి జిల్లాలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు ధాన్యం సేకరణ, వ్యవసాయo,ఇందిరమ్మ ఇండ్లు, భూ భారతి చట్టం పై జిల్లాల వారీగా కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రజా సంక్షేమ పథకాలు అందాలన్నారు. రికార్డ్ స్థాయిలో ధాన్యం పండిస్తున్నామన్నారు. దేశంలోనే ధాన్యం పండించడంలో మొదటిస్థానంలో ఉందన్నారు. ధాన్యం పండించడమే కాకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నామన్నారు. ప్రజా ప్రభుత్వంలో రైతులందరూ సంతోషంగా ఉన్నారన్నారు. సన్నారకు బోనస్ తో రైతులు పంటలు పండించడానికి పరిత ముందుకు వస్తున్నారు అన్నారు. కలెక్టర్ లే వెళ్లి నేరుగా రైతులను కలుస్తున్నారన్నారు. ఇందిరమ్మ ఇండ్ల 5 లక్షలు రూపాయలు చెల్లిస్తున్నామని, నియోజకవర్గానికి 3500 ఇండ్లు అదనంగా 20% ఉందని కూడా అందిస్తున్నామని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో వ్యవసాయనికి పెద్ద పీట వేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ధరణితో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని అన్నారు. రైతులకు ఎలాంటి ఎరువుల, విత్తనాల కొరత లేదని పూర్తి స్థాయి లో స్టాక్ లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఉమ్మడి జిల్లాలో 95 శాతం ధాన్యం సేకరణ పూర్తి అయిందన్నారు. అకాల వర్షం తో తడిసిన ధాన్యాన్ని కూడా కొంటాం అని రైతు కళ్ళంలో ఉన్న చివరి గింజ వరకూ సేకరిస్తాం అన్నారు.
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తం..
మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ.. సమాజంలో ప్రజల జీవన విధానంలో మార్పు ప్రజా ప్రభుత్వం ద్వారానే సాధ్యం అవుతుందన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని,అరులైన ప్రతి పేద వారికి ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేయాలని, ప్రజా ప్రభుత్వంలో నూతన భూ భారతి చట్టం తీసుకొని రావడంతో రైతులు,ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. భూ భారతి చట్టంతో రైతులు కార్యాలయ చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగే అవకాశం లేదన్నారు. గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్ వేసి చెత్త నీటి నిల్వ లేకుండా చూడాలన్నారు. తాగునీటి ఇబ్బందులు లేకుండా కరెంటు సమస్య రాకుండా చూడాలని అధికారం ఆదేశించారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో ఇసుక కొరత లేకుండ చుడలని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం లో ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ భూ భారతి చట్టం పై ప్రజలకు అవగాహన కల్పించాలని,ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ధాన్యం కొనుగోలు పూర్తిగా కొనుగోలు చేయాలని, పాఠశాలకు పున: ప్రారంభం లో పాఠశాల పరిశుభ్రం చేయాలని సరిపడా సిబ్బంది ఉన్నారా లేదా అని అధికారులు దృష్టి సారించాలని అన్నారు.







