హన్మకొండ మహా;
వర్షాకాలం నేపధ్యం లో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డి ఆర్ ఎఫ్) బృందం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు.
శనివారం హన్మకొండ లోని నక్కలగుట్ట సర్కిల్ కార్యాలయ ఆవరణలో గల డి ఆర్ ఎఫ్ కార్యాలయంతో పాటు నర్సరీ నీ మేయర్ క్షేత్ర స్థాయిలో ఆకస్మికంగా తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మేయర్ కార్యాలయంలో ఉన్న బోట్ల ను పరిశీలించి వాటి పని తీరును స్థితి గతులను (కండిషన్) అడిగి తెలుసుకోవడం తో పాటు సిబ్బంది తో మాట్లాడి విధి నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు.
నర్సరీని సందర్శించిన మేయర్ ఇందులో పెంచబడుతున్న మొక్కల రకాలను సిబ్బందిని అడిగి తెలుసుకొని రాబోవు వనమహోత్సవాన్ని దృష్టి లో ఉంచుకొని ఎక్కువ మొత్తంలో మొక్కలను పెంచాలని మొక్కల పెంపకానికి అందజేతకు సంబంధించిన రికార్డులను సక్రమం గా నిర్వహించాలని మేయర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఎస్ ఈ ,సి పి లు శ్రీనివాస్ రవీందర్ రాడేకర్, ఈ ఈ లు రవికుమార్, మాధవి లత, ఏసిపి రజిత, డి ఈ రాజ్ కుమార్, టి పి ఎస్ రోజా రెడ్డి, తదితరులు, పాల్గొన్నారు.







