Mahaa Daily Exclusive

  ప్రమాదంలో లక్షల మంది విద్యార్థులకు భవితవ్యం టిఎస్ఎస్ఓ రాష్ట్ర అధ్యక్షుడు ఎం లక్ష్మీనివాస్..!

Share

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
ఫీజు రియంబర్స్ మెంట్ పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య పూరిత దోరణితో లక్షల మంది పేద విద్యార్థుల భవితవ్యం ప్రమాదంలో పడిందని టీఎస్ఎస్ఓ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దాదాపు రూ.8,000 వేల కోట్లకు పెరిగిపోయిన ఫీజు రియంబర్స్ మెంట్ తక్షణం చెల్లించాలంటూ శుక్రవారం ఆమనగల్లులో విలేకరులతో వెల్లడించారు. ఇకపై అన్ని నిర్ణీత కాల పట్టిక ప్రకారం వాయిదాలు కుండా చెల్లింపులకు చర్యలు తీసుకోవాలని కోరారు. రియంబర్స్ మెంట్ బకాయిలతో సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేటు కాలేజీలు, అధ్యాపకులకు వేతనాలు చెల్లించలేని దుస్థితి నెలకొందన్న లక్ష్మీనివాస్. వేల సంఖ్యలో కాలేజీలు అప్పులతో మూత పడుతున్నాయని గుర్తు చేశారు. కోర్సులు పూర్తిచేసిన పేద విద్యార్థులు సర్టిఫికెట్లు అందక, ఉద్యోగాలకు దరఖాస్తు చేయలేక, ఉన్నత విద్య అభ్యసించలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.
విద్యార్థులకు కాలేజీ యాజమాన్యానికి మధ్య గర్షణ…
కాలేజీ యాజమాన్యాలకు, విద్యార్థులకు మధ్య జరిగిన గొడవలు పోలీస్ స్టేషన్ ల వరకు వెళుతున్న పట్టించుకోరా? అని రాష్ట్ర సర్కారును నిలదీశారు. ‘ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు ఓటీఎస్ కింద సెటిల్ చేయాలని డిమాండ్ చేశారు.

అసెంబ్లీ సమావేశాలలో…
విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఆ విద్యా సంవత్సరానికి చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లిస్తామని, గతంలో జేఎన్టీయూలో, అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు’ అని టిఎస్ఎస్ఓ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనివాస్ గుర్తు చేశారు. తక్షణమే ఫీజు బకాయిలు చెల్లించకపోతే తదుపరి పరిణామాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మీసాల వంశీ, రాష్ట్ర కోఆర్డినేటర్ సుదర్శన్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ చిక్కి, సందీప్, టిఎస్ఎస్ఓ ఆమనగల్ మండల కమిటీ తదితరులు పాల్గొన్నారు..

Latest