Mahaa Daily Exclusive

  లేబర్ కోడ్ బిల్లులు వెనక్కు తీసుకునే వరకు ఉద్యమం తీవ్రతరం చేస్తాం – భూక్య రమేష్ హెచ్చరిక..!

Share

భద్రాద్రి కొత్తగూడెం, మే 14 (మహా):
ప్రజలంతా ప్రాణాలను అర చేతిలో పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్న కరోనా సమయంలో 2020 లో పార్లమెంట్ లో ఏకపక్షంగా అప్పటి వరకు అమలులో ఉన్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి,నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చి కార్మికవర్గ ఉనికే ప్రశ్నార్థకం చేసిందని, నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మే 20 న జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె తో కేంద్రం బిజెపి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్ పిలుపునిచ్చారు.
కార్మికుల భవిష్యత్ కి ప్రమాదకరంగా మారిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని,ఇండస్ట్రీస్,పబ్లిక్ సెక్టార్ లను రక్షణ కోసం జరుగుతున్న మే 20 తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని కొత్తగూడెం పట్టణంలో కార్మికుల పని ప్రాంతాల్లో సీఐటీయూ ఆద్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. పలు సంస్థల యజమానులకు సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వంద సంవత్సరాల పాటు కార్మికవర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేయడం అంటే కార్మికవర్గ హక్కులను కార్పొరేట్ వర్గాలకు తాకట్టు పెట్టడం తప్ప మరొకటి కాదని అన్నారు.కార్మికుల పని గంటలను 8 నుండి 12 గంటలకు పెంచడం ద్వారా కార్మికవర్గాన్ని మరింత దోపిడీకి గురి చేసి కార్పొరేట్ శక్తుల సంపదను పెంచుకోవడానికి తప్ప మరొకటి కాదని అన్నారు.1991 నుండి నూతన ఆర్థిక విధానాలను అమలు చేయడం వల్ల దేశం లో తీవ్ర అసమానతలు పెరిగిపోయాయని ఈ విషయాన్ని ఆక్స్ఫామ్ సంస్థ వెల్లడించిందని అన్నారు.దేశం లో పెరుగుతున్న
అసమానతలను కేంద్ర బడ్జెట్ కి ముందు ఆర్థిక సర్వే కూడా చెప్పిందన్నారు.మోడీ ప్రభుత్వం అమలు చేసే లేబర్ కోడ్ ల వల్ల కార్మిక హక్కులు హరించి,బానిస రోజులు రాబోతున్నాయని అన్నారు.2020 లో పార్లమెంట్ లో ఆమోదించబడిన లేబర్ కోడ్ లను ఇప్పటి వరకు అమలు కానివ్వకుండా కార్మికవర్గం చేసిన పోరాటాలను చేసిందన్నారు.ప్రపంచ వ్యాపితంగా సరళీకరణ ఆర్థిక విధానాలకు వ్యతిరేఖంగా సమరశీల పోరాటాలు జరుగుతున్నాయని,
మన దేశం లో కూడా విద్యుత్ ప్రవేతికరణ కి వ్యతిరేఖంగా ఉత్తరప్రదేశ్,మహారాష్ట్ర,బీహార్ వంటి రాష్ట్రాలలో కార్మికులు,ఉద్యోగులు వీరోచిత పోరాటం చేయడం వల్ల అనివార్యంగా ప్రభుత్వాలు దిగి వచ్చాయని అన్నారు.ఎస్మా వంటి చట్టాన్ని ప్రయోగించినా దీనిని లెక్క చేయలేదన్నారు.రద్దు చేసిన 29 కార్మిక చట్టాల్లో అత్యధిక భాగం బ్రిటిష్ కాలం లో వచ్చాయని,సంఘం పెట్టుకునే హక్కు,సమ్మె చేసే హక్కు,
ఎనిమిది గంటల పని దినం హక్కు,ఉమ్మడి బేరసారాలు ఆడే హక్కు వంటి చట్టాలన్ని రద్దు ఐపోతున్నాయని అన్నారు.సామాజిక భద్రత అన్నా పిఎఫ్ ఇఎస్ఐ ,గ్రాట్యూటి చట్టాల్లో అనేక మార్పులు తెచ్చారని,ఈ మార్పులన్నీ కార్మికులను తీవ్ర అన్యాయానికి గురి చేసేదిగా ఉన్నదని అన్నారు.లేబర్ కోడ్ లలో కార్మిక సమస్యలపై అండ గా యూనియన్ నాయకత్వం ఉండి పోరాటాలు చేస్తే భారత న్యాయ సంహిత చట్టాల ద్వారా అరెస్టు చేసి,కేసు నమోదు చేసి,ఆరు నెలలు జైలు కి పంపాలని,సమ్మె లకి ప్రేరేపించినా,సహకరించిన వారెవరికైనా ఇదే పద్ధతిలో శిక్షలు ఉంటాయని పొందుపరచారన్నారు.ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే విధంగా ఉన్న లేబర్ కోడ్ ల రద్దు కోసమే మే 20 న సమ్మె జరుగుతున్నదని అన్నారు.ఈ సమ్మె కి మద్దతుగా సంయుక్త కిసాన్ మోర్చా గ్రామీణ భారత్ బంద్ కి పిలుపు ఇచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు రామకృష్ణ రాధాకృష్ణ శ్రీను రవి రాంబాబు వెంకన్న తదితరులు పాల్గొన్నారు

Latest