*కొత్తగూడెం, మహా.
నల్ల బంగారం వెలికితీస్తూ..శ్రమిస్తున్న సింగరేణి కార్మికులకు అండగా నిలుస్తామని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి అభయమిచ్చారు. శనివారం కొత్తగూడెం లోని సింగరేణి ప్రధాన కార్యాలయానికి వెళ్లి.. ఆ సంస్థ డైరెక్టర్ (పా) కే. వెంకటేశ్వర్లు, జీఎం, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో వైద్యుల కొరత లేకుండా చూడాలని, కార్మికులకు విధి నిర్వహణలో ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ప్రభుత్వ పరంగా సింగరేణికి పూర్తి సహకారం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో.. కాంగ్రెస్ జిల్లా నాయకులు, ఐఎన్టీయూసీ నాయకులు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Post Views: 38







