Mahaa Daily Exclusive

  రోళ్లపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య…..!

Share

టేకులపల్లి – మహా

టేకులపల్లి మండలం “రోళ్లపాడు” గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను సందర్శించిన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య త్వరలో శంకుస్థాపన కార్యక్రమం నేపథ్యంలో నిజమైన అర్హుల ఎంపిక అయినటువంటి లబ్దిదారుల ప్రతీ ఇంటిని సందర్శించి పథకాన్ని పారదర్శకంగా ఎంపిక పక్రియ చేయాలనీ ఇందిరమ్మ కమిటీ సభ్యులకు తగు సూచనలను చేసారు ఈ సందర్బంగా మాట్లాడుతూ… మొదటి విడతలో ఇండ్లు రానివారు నిరాశ చెందవద్దని అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇండ్లు మంజూరు ఈ ప్రభుత్వం లో అవుతుందని హామీ ఇచ్చారు. నమూనా ప్రకారం ఇండ్లు నిర్మాణం ప్రారభించాలని 400 చదరపు అడుగులు తగ్గకుండ 600 చదరపు అడుగులు మించకుండా ఇండ్లు నిర్మించుకోవాలని సూచించారు
ఈ కార్యక్రమంలో నాయకులు కోరం సురేందర్ ఇంచార్జి ఎంపీడీవో గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈది గణేష్,శివ, ఊళ్ళోజు ఉదయ్,సర్దార్, బొడ్డు అశోక్ పంచాయతీ సెక్రటరీ, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు

Latest