Mahaa Daily Exclusive

  కాంగ్రెస్ గెలుపు కోసం కష్టపడ్డ వారికి పదవులు దక్కుతాయి..!

Share

సత్తుపల్లి – మహా.
కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పదవులు దక్కుతాయని ఇప్పటికే పలు నామినేటెడ్ పోస్టుల్లో కష్టపడ్డ వారికి స్థానం దక్కుతుందనీ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రగమాయి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే అధ్యక్షతన ఏర్పాటు చేసిన
సమావేశానికి ఎంపీ రామసహాయం రఘు రామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పెహల్గం మృతులకు సంఘభావంగా మౌనం పాటించారు. అనంతరం ఎంపీ రామసహాయం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళ మాదిరిగా నడిపిస్తుందన్నారు. గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలే పార్టీకి పునాదని, గ్రామ కేడర్ ను మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ అడుగులు వేస్తుందన్నారు. ఎమ్మెల్యే రాగమయి మాట్లాడుతూ పలు ఆలయ కమిటీలు, మార్కెట్ కమిటీ లు, ఇందిరమ్మ కమిటీలతో పాటు పలు నామినేటెడ్ పోస్టుల్లో పార్టీ కోసం కష్టపడిన వారికి ఇప్పటికే అవకాశాలు దక్కాయని తెలిపారు.పార్టీనీ బలోపేతం చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు. రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ మాట్లాడుతూ వర్గాలకు అతీతంగా పార్టీ లో కొత్త, పాత తేడా లేకుండా అందరికీ సమ ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్లతో పాటు ప్రతి సంక్షేమ పథకంలోనూ పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని పేర్కొన్నారు. ఎం ఎల్ సి తాత మధు కు చేతనైతే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. చేతగాని విమర్శలు తగవని సున్నితంగా హెచ్చరించారు. అనంతరం 134 కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులకు గాను రూ.1.34 కోట్లు, 5 మండలాలకు రూ. 38.45 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం జేవియర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ఎంపీ నిధులతో చేపట్టిన పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అదేవిధంగా రూ.95 లక్షల విలువ గల అదనపు తరగతి గదుల నిర్మాణానికి మంజూరు అయినట్లు ఎమ్మెల్యే రాగమయి తెలిపారు. వెంగళరావు నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, నియోజకవర్గ ఇంచార్జ్ బత్తిని శ్రీనివాస్, కో ఆర్డినేటర్ అనిల్, SC సెల్ అధ్యక్షులు బొడ్డు బొందయ్యా,సెల్ అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, శేఖర్ గౌడ్, ఏ ఎం సి చైర్మన్ లు దోమ ఆనంద్, భాగం నీరజ, తోట సుజాల రాణి, తదితరులు పాల్గొన్నారు.

Latest