కారేపల్లి, మహా,
దేవదాయ శాఖ భూములకు సంబంధించి కౌలు బకాయిల వసూళ్లకు ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేసినట్లు దేవాదాయశాఖ ఇన్‌స్పెక్టర్ బేల్ సింగ్ అన్నారు. శుక్రవారం కారేపల్లి మండలం మాధారం గ్రామపంచాయతీ కార్యాలయంలో దేవదాయ సాగు భూముల వేలం పాటను ఈవో వేణుగోపాలాచార్యులు అధ్యతన నిర్వహించారు. ఈవేల పాటకు హాజరైన ఇన్‌స్పెక్టర్ బేల్ సింగ్ మాట్లాడుతూ కౌలు చెల్లించకుండా ఉన్న బకాయి పడ్డ వాటిని ఈనెల 5వరకు స్పెషల్ డ్రైవ్ వసూళ్ల చేయటం జరుగుతుందని, అప్పటి వసూళ్లు కాని భూముల పాత కౌలు రద్దు చేసి కొత్తగా బహిరంగ వేలం వేయటం జరుగుతుందన్నారు.దేవదాయ భూములను కౌలుకు తీసుకున్న రైతులు తప్పని సరిగా ప్రతి ఏటా కౌలు చెల్లించాలన్నారు. కారేపల్లి మండల పరిధిలో పర్సా అనంతరామయ్య ధర్మసంస్ధ ఇల్లందుటౌన్ అనుబంధ దేవాలయాలైన ఇల్లందులోని శ్రీ విశ్వేశ్వరస్వామి ఆలయం, గేటుకారేపల్లిలో శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయాల క్రింద పట్టా భూములు ఉన్నాయన్నారు.2025-26, 2026-27, 2027-28 సంవత్సరాల కౌలుకు సంబంధించి ఈనెల 6వ తేదిన అయా గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద వేలం పాట ఉంటుందని తెలిపారు. అసక్తికల రైతులురూ.2వేలు ధరావత్తు చెల్లించి పాటల పాల్గనవచ్చాన్నారు. శుక్రవారం మాధారం లో నిర్వహించిన వేలం పాటను ఈనెల 6వ తేదికి వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ సిబ్బంది తోటకూరి వెంకటేశ్వర్లు, పర్సా సాయి లలిత్, శ్రీకాంత్ రెడ్డి, గణితి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.







