మణుగూరు, మహా ; నియోజకవర్గస్థాయిలో పదవ తరగతి పరీక్షా ఫలితాలలో టాపర్గా నిలిచిన మాంటిస్సోరి శ్రీ సత్య భాస్కర హై స్కూల్ విద్యార్థిని బి సత్య అనీసిని ని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అభినందించారు. 600 మార్కులకు గాను 585 మార్కులు సాధించి టాపర్గా నిలవడంతో క్యాంప్ ఆఫీసు నందు ఎమ్మెల్యే సత్య అనీసిని ని ఘనంగా సన్మానించారు. అలాగే 583 మార్కులు సాధించిన అంచుమల్ల సిరి ని, అలాగే 580 మార్కులు సాధించిన శ్రీ విజ్ఞాన్ హైస్కూలు విద్యార్థి మేడా భాను ను అభినందించారు. కార్యక్రమంలో విద్యాసంస్థల ఉపాధ్యాయులు పుర ప్రముఖులు పాల్గొన్నారు.
Post Views: 46







