Mahaa Daily Exclusive

  కుల గణనపై కేంద్ర తీసుకున్న నిర్ణయం పై హర్షం రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు..!

Share

ఖమ్మం – మహా.
దేశ వ్యాప్తంగా కుల గణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు..ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయం పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దార్శనికత నెరవేరబోతుందని అభిప్రాయపడ్డారు.. రాహుల్ గాంధీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయగలిగారని పేర్కొన్నారు.. దేశంలో కుల గణన ప్రక్రియను ప్రారంభించిన తోలి రాష్ట్రం తెలంగాణ అని, రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగానే రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది అని గుర్తు చేశారు.. సాధారణ జన గణనతో పాటు కుల వారిగా గణాంకాలను సేకరించాలనే నిర్ణయం హర్షించదగిన విషయమని పేర్కొన్నారు..

Latest