భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 30 (మహా):
రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి గా బాధ్యతలు స్వీకరించిన కె. రామకృష్ణారావును సింగరేణి సీఎండీ ఎన్.బలరాం బుధవారం సాయంత్రం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి సంస్థ తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు. కె.రామకృష్ణారావు ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉంటూ సింగరేణి సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఒకరిగా సంస్థ అభివృద్ధికి ఎంతగానో సహకరించారని తెలుపుతూ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంస్థ అభివృద్ధికి తోడ్పాటును అందించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.
Post Views: 24







