Mahaa Daily Exclusive

  మీనాక్షి నటరాజన్​తో రాజగోపాల్ రెడ్డి భేటీ…!

Share

తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌ను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి బుధవారం గాంధీభవన్​లో మర్యాదపూర్వకంగా కలిశారు. తనతో పాటు పార్లమెంట్‌లో ఎంపీ‌గా కలిసి పని చేసిన వ్యక్తి, ఇంచార్జిగా వచ్చిన తరువాత మొదటి సారి కలిశాను. జిల్లాల వారీగా ఇంచార్జిలు, పార్టీ నిర్మాణం పై చర్చ జరిగింది. స్థానిక ఎన్నికలు, సమీపిస్తున్న తరుణంలో పార్టీని ఇంకా బలోపేతం చేయడం, తనను కూడా యాక్టీవ్ రోల్ ప్లే చేయాలని ఆమె సూచించారని రాజగోపాల్​రెడ్డి తెలిపారు.

Latest