Mahaa Daily Exclusive

  16 రాష్ట్రాల డిసిసిలతో కీలక సమావేశం పార్టీ నిర్మాణంలో కీలక భూమిక పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో హాజరైన తెలంగాణ నేతలు..!

Share

ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ సమావేశంలో 16 రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో తెలంగాణ డీసీసీ అధ్యక్షుల హాజరు కాగా, ఎఐసిసి నేతలు గ్రూప్ ఫొటో దిగారు. ఏప్రిల్ 8,9 తేదీల్లో అహ్మదాబాద్‌లో డీసీసీల పనితీరుపై సమగ్ర చర్చ జరగనుండగా, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కేసి వేణుగోపాల్ నేతృత్వంలో డీసీసీ లకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఇకపై పార్టీ నిర్మాణంలో డీసీసీ లు కీలకంగా ఉంటాయని, కాంగ్రెస్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తామని పేర్కొన్నారు. త్వరలో దేశవ్యాప్తంగా ఒకేసారి డిసిసిల నియామకం చేయనున్నారు. సంస్థాగతంగా నిర్మాణాన్ని పటిష్టం చేయడంతో పాటు సిద్దాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేలా డిసిసిలకు రెగ్యులర్ గా కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు. తెలంగాణలో ఎమ్మెల్యేలు డిసిసి అధ్యక్షులుగా ఉండడం, పలు జిల్లాల్లో అధ్యక్షులు లేకపోవడంతో ప్రతినిధులు జై సంవిధాన్ భేటీకి హాజరయ్యారు. రాజ్యాంగ పరిరక్షణే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఒకే తరహా కార్యక్రమాలు చేపట్టనుంది. పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేసీఆ వేణుగోపాల్, రాష్ట్రాల ఇన్ ఛార్జిలు మీనాక్షి నటరాజన్, దీపాదాస్ మున్షీ, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. మొత్తం 16 రాష్ట్రాల ప్రతినిధులు ఈ సభకు హాజరయ్యారు.

Latest