Mahaa Daily Exclusive

  కండక్టర్‌లా సీఎం విజయ్…

Share

  • కండక్టర్‌లా సీఎం విజయ్
  • మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ ప్రారంభం
  • చెన్నైలో ప్రారంభించిన ముఖ్యమంత్రి

చెన్నై, మహా : తమిళనాడు సీఎం బాధ్యతలు చేపట్టిన విజయ్ ఎన్నికల్లో ఇచ్చిన ముఖ్యమైన హామీలపై దృష్టి పెట్టారు. రాష్ట్రంలోని మహిళల కోసం ప్రతిష్టాత్మకమైన ‘వెట్రి పయనం’ (విజయ యాత్ర) పథకానికి శ్రీకారం చుట్టారు. చెన్నైలోని కోయంబేడు బస్ స్టాండ్‌లో అత్యంత వైభవంగా జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం విజయ్ స్వయంగా పాల్గొని ఈ పథకాన్ని ప్రారంభించారు. వెట్రి పయనం పథకం ప్రారంభించిన సీఎం విజయ్ స్వయంగా బస్సులో ప్రయాణించి.. మహిళా ప్రయాణికులకు ఫ్రీ బస్ టికెట్లను ఇచ్చారు. ఈ సందర్భంగా బస్సులో ఉన్న మహిళలు తమ అభిమాన నాయకుడిని చూసి ఉద్వేగానికి లోనయ్యారు. కొందరు యువతులు సీఎం విజయ్‌తో సెల్ఫీలు దిగగా, మరికొందరు చాక్లెట్లు, తమ సమస్యల వినతిపత్రాలను అందజేశారు. బస్సులో కొందరు మహిళలు తన పక్కనే కూర్చోవాలని కోరగా, వారి ఆప్యాయతను మన్నించి వారి మధ్యే కూర్చుని మాట్లాడారు. వృద్ధుల ఆయనను ఆశీర్వదించగా, మరికొందరు కరచాలనం చేసి తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.

తమిళనాడు ప్రభుత్వ బస్సుల్లో మహిళలందరూ ఉచితంగా ప్రయాణించేలా ఈ స్కీమ్ ను తీసుకొచ్చింది టీవీకే ప్రభుత్వం. మహిళల ఆర్థిక స్వావలంబనకు, రవాణా సౌకర్యాలను సులువు చేయడానికి ఈ పథకం ఎంతగానో దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. బస్సులో ప్రయాణించి, సామాన్యుడిలా టికెట్లు ఇవ్వడం.. సీఎం విజయ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం రాజకీయ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ భారీ స్పందన తెచ్చింది. ఈ పథకం కింద మహిళలు, ట్రాన్స్ జెండర్లు, దివ్యాంగులు ఛార్జీల్లేకుండా ఏసీ మినహా మిగతా అన్ని బస్సుల్లో ప్రయాణించవచ్చు.