Mahaa Daily Exclusive

  పేదలకు సహాయం ముసుగులో పరిహారంలో అక్రమాలు…

Share

  • పేదలకు సహాయం ముసుగులో పరిహారంలో అక్రమాలు…
  • అక్రమార్కులను కాపాడేందుకు పేదల పేరుతో పక్కదోవ పట్టించే ప్రయత్నం…
  • పేదలందరికీ పరిహారం మూడు నెలల క్రితమే అందింది…
  • అక్రమాలకు పాల్పడిన వారి బాగోతం బట్ట బయలు చేయడమే మీడియా ఉద్దేశం..

కారేపల్లి, మహా: పేదలకు సహాయం చేస్తున్నామ నే ముసుగులో భారీ అక్రమాలకు పాల్పడ్డ అక్రమార్కులు విషయాన్ని తప్పుతోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్న తీరు కారేపల్లి మండలంలో చర్చనీయాంశమైంది. ప్రభుత్వ భూమిలో రేకుల షెడ్లకు ఇంటి పన్ను రసీదులు జారీ చేసిన విషయం లో తప్పు చేసిన కార్యదర్శి పై చర్యలు తీసుకోవడానికి జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతుండడంతో ఆ అధికారిని కాపాడటం కోసం పేదలను అడ్డం పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కారేపల్లి గ్రామానికి చెందిన రైల్వే డబుల్ లైన్ లో ఇళ్లు కోల్పోయిన పేదలందరికీ ప్రభుత్వం పరిహారం మూడు నెలల క్రితమే అందజేసింది. ఆ పరిహారంతో పేదలంతా కూడా అక్కడ ఇళ్లను ఖాళీ చేసేసి ప్రత్యామ్నాయంగా ప్లాట్లను కొనుక్కొని ఇల్లు నిర్మించుకునే పనుల్లో నిమగ్నం అయ్యారు. ఈ విషయాలు తెలిసి కూడా కొందరు పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ వ్యవహరించడం విచారకరం. కారేపల్లి రైల్వే భూ నిర్వాసితులకు మెరుగైన పరిహారం అందరికీ అందించాలని పత్రికలు అనేక కథనాలను గతంలో రాశాయి. పత్రికలు ప్రజల పక్షాన నిలుస్తాయి. కానీ పేదల ముసుగులో జరిగిన అక్రమాన్ని మాత్రం బట్టబయలు చేయడంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా … పేదలను అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేయాలనే ప్రయత్నాలు మానుకుంటే బాగుంటుందని పలువురు వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు… ఇంటి పన్ను రసీదులు ఇవ్వడానికి ఎంత వసూలు చేశారు… పరిహారం వచ్చిన తర్వాత వారి వద్ద ఎంత డబ్బులు మింగారు అనే పూర్తి ఆధారాలు మీడియా వద్ద ఉన్నయి కాబట్టి పత్రిక లు స్వేచ్ఛగా వార్తలు రాయగలుగుతున్నాయి. ఆ స్వేచ్ఛను హరించాలనే ప్రయత్నం ఏ మాత్రం మంచిది కాదు.. కారేపల్లి లో జరిగిన అక్రమంపై పత్రికల్లో వచ్చిన కథనాలు ఏ ఒక్క పేదవాడికి కూడా నష్టం తెచ్చేది కాదు… భవిష్యత్తులో కూడా వారికి ఎటువంటి నష్టం జరగదు కానీ వారి ముసుగులో అక్రమానికి పాల్పడిన వారిపై చర్యలు మాత్రం తప్పకుండా ఉంటాయి.. పేదలకు సహాయం చేయాలి కానీ ఆ సహాయం ముసుగులో జరిగిన అక్రమం ఏంటో తప్పులు చేసిన వారికి వారి అంతరాత్మలకు ఇప్పటికే అర్థమై ఉంటుంది… ఇంకా పేదలని పావులుగా వాడుకుంటూ పాపాలు చేయాలనే ఆలోచనలు ఏమాత్రం సరి కాదని పత్రికా స్వేచ్ఛను కాపాడేవారు వారి అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు..