Mahaa Daily Exclusive

  దిల్‌సుఖ్‌నగర్ సంతోషిమాత ఆలయంలో అలజడి..

Share

  • దిల్‌సుఖ్‌నగర్ సంతోషిమాత ఆలయంలో అలజడి
  • అల్లా హో అక్భర్ అంటూ విగ్రహం ధ్వంసానికి యత్నించిన జిహాదీ
  • పూజారిపై దాడి
  • పట్టుకుని దేహ శుద్ధి చేసి పోలీసులకు పట్టించిన భక్తులు

హైదరాబాద్‌, మహా : నగరంలోని ఓ ఆలయంలో ఓ దుండగుడు చేసిన పని కలకలం రేపింది. ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని దిల్‌‌సుఖ్‌నగర్ సంతోషిమాత గుడిలో ముస్లిం వ్యక్తి వీరంగం చేశాడు. పూజారిపై దాడి చేసిన ఆ నిందితుడు అంతడితో ఆగకుండా కర్రతో అమ్మవారి విగ్రహంపై దాడి చేశాడు. ఇది గమనించిన భక్తులు వెంటనే అప్రమత్తమై ఆ వ్యక్తిని అడ్డుకుని చితకబాదారు. నిందితుల్ని పోలీసులకు అప్పగించారు. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే సంతోషిమాత ఆలయంలో శుక్రవారం ఉదయం జరిగిన ఘటన తీవ్ర కలకలం రేగింది. దిల్‌సుఖ్‌నగర్ బస్సు డిపో పక్కనే ఉన్న ప్రముఖ సంతోషిమాత టెంపుల్ లోకి ఉదయం దాదాపు 10:05 గంటల ప్రాంతంలో మహమ్మద్ అన్సారీ అనే వ్యక్తి ప్రవేశించి హల్‌చల్ చేశాడు. ఆలయంలోకి చొరబడిన అతడు “అల్లాహు అక్బర్” అని నినాదాలు చేస్తూ తన చేతిలో ఉన్న కర్రతో పూజారిపై దాడికి యత్నించాడు. అంతటితో ఆగకుండా ఏకంగా అమ్మవారి విగ్రహాన్ని కర్రతో కొడుతూ ధ్వంసం చేసే ప్రయత్నం చేశాడు.

ఈ ఆకస్మిక ఘటనతో అప్రమత్తం అయిన ఆలయ పూజారి, అక్కడున్న భక్తులు వెంటనే స్పందించి నిందితుడు అన్సారిని పట్టుకున్నారు. అనంతరం పూజారి, భక్తులు డయల్ 100 ద్వారా చైతన్యపురి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక చైతన్యపురి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిందితుడిని ఎట్టి పరిస్థితులలో వదిలిపెట్టొద్దని డిమాండ్ చేస్తున్నాయి.