- మంద బాబురావు మృతి పట్ల సంతాపం
- ఆసుపత్రి బిల్లు చెల్లించిన డిసిసి అధ్యక్షుడు అయూబ్
వరంగల్,గీసుకొండ మహా;
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం పోతరాజుపల్లె గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో సేవలందించిన మంద బాబురావు అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వరంగల్ లోని ఆరుషి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం మృతి చెందడం పట్ల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పార్టీ శ్రేణులు తీవ్ర విషాదానికి లోనయ్యారు. మంద బాబురావు మృతదేహాన్ని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ సందర్శించి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి దుఃఖంలో పాలుపంచుకున్నారు. కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకున్న జిల్లా అధ్యక్షుడు అయూబ్ తన మానవత్వాన్ని చాటుకున్నాడు. వెంటనే ఆసుపత్రి బిల్లును పూర్తిగా చెల్లించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించేలా సహకారం అందించారు.
కాంగ్రెస్ పార్టీ కోసం మంద బాబురావు అందించిన సేవలను ఈ సందర్భంగా అయూబ్ స్మరించుకున్నారు. ఆయన మృతి పార్టీకి, గ్రామానికి తీరని లోటని పేర్కొంటూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మంద బాబురావు ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని అయూబ్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.








