Mahaa Daily Exclusive

  సర్పంచ్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు….

Share

 

కారేపల్లి, మహా:గ్రామాల్లో అభివృద్ధి చేయలేకనే తమపై అవాస్తవ ఆరోపణలు చేస్తూ,గ్రామంలో ఉన్న యువకులపై ఫిర్యాదులు చేస్తున్న భజ్యాతండా సర్పంచ్ హనుమంతరావు తన విధానాన్ని మార్చుకోవాలని బిఆర్ఎస్ పార్టీ నాయకులు రాందాస్ తెలిపారు.గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల జరుపుకున్న వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా గ్రామంలో జరిగిన వివాదాలను రాజకీయాలతో ముడి పెట్టడం సరికాదన్నారు.గత ఐదేళ్లు తన సతీమణి సంధ్య హయాంలో గ్రామపంచాయతీలో అనేక అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు.గ్రామంలో గణేశుడి ఊరేగింపు సందర్భంగా ఓ యువకుడితో సర్పంచ్ కు జరిగిన వాగ్వాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో రాజీమార్గంలో పరిష్కరించుకోవలసిన సమస్యను రాజకీయాలతో ముడిపెట్టి చూడడం తగదన్నారు.గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలను హుందాగా స్వీకరించి ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.గ్రామ అభివృద్ధి విషయంలో సర్పంచ్ కు ఎల్లవేళలా సహకరించడానికి తామెప్పుడు సిద్ధంగా ఉంటామని అన్నారు.ఈ సమావేశంలో జీపీ వార్డు సభ్యులు అజ్మీరా కుమార్,కోటేష్,భాస్కర్, మాలోత్ పత్య,అజ్మీర మంగ్య, భూక్యా రవి, బానోత్ దేవా,శ్రీను,బానోతు కౌసల్య,లకావత్ వినోద్ లక్ష్మణ్,సాగర్,పవన్ గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.